Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: సెంచరీ మిస్ చేసుకున్న శ్రేయాస్.. పగ తీర్చుకున్న ఎబాదత్..!

Shreyas Iyer misses century in INDvsBAN test

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ కెరటం శ్రేయాస్ అయ్యర్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 82 పరుగులతో అజేయంగా ఉన్న అతను.. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే పెవలియన్ చేరాడు. దీంతో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అయ్యర్ కచ్చితంగా సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు.

పగ తీర్చుకున్న ఎబాదత్..

పగ తీర్చుకున్న ఎబాదత్..

రెండో రోజు ఆట మొదలైన తర్వాత కూడా క్రీజులో జాగ్రత్తగానే ఉన్నాడు అయ్యర్. కానీ ఎబాదత్ హొస్సేన్ వేసిన 98వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ బుట్టలో పడ్డాడు. ఆ ఓవర్ చివరి బంతిని ఎబాదత్ ఇన్‌స్వింగర్ వేశాడు. అది గమనించని శ్రేయాస్.. తన లైన్‌లో డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అవుట్ సైడ్ ఎడ్జ్‌ను మిస్ అయిన బంతి నేరుగా వెళ్లి ఆఫ్‌స్టంప్‌ను పడగొట్టింది. అది చూసిన శ్రేయాస్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. ఎబాదత్ మాత్రం తనదైన స్టైల్లో సెల్యూట్ కొట్టి శ్రేయాస్‌ను సాగనంపాడు.

 తొలి రోజు కలిసొచ్చిన అదృష్టం..

తొలి రోజు కలిసొచ్చిన అదృష్టం..

తొలి రోజు ఆటలో ఎబాదత్ బౌలింగ్ చేసినప్పుడే అయ్యర్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఎబాదత్ హోసెన్ వేసిన 84వ ఓవర్లో బంతిని అయ్యర్ సరిగా అంచనా వెయ్యలేకపోయాడు. ఆ డెలివరీ చాలా తక్కువ ఎత్తులో వచ్చింది. దాన్ని ఎలాగైనా ఆడేందుకు అయ్యర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కానీ అనూహ్యంగా ఆ బంతి వికెట్లను తాకినా.. బెయిల్ కిందపడలేదు. దీంతో రూల్స్ ప్రకారం అయ్యర్ అవుట్ అవలేదు. ఇది చూసిన బంగ్లా ఫీల్డర్లు నోరెళ్ళబెట్టారు.

 మెరుగైన స్థితిలోనే భారత్..

మెరుగైన స్థితిలోనే భారత్..

అయ్యర్ అవుటయ్యే సమయానికి భారత జట్టు 98 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులతో ఉంది. క్రీజులో అశ్విన్ ఉండగా.. అతనికి కుల్దీప్ యాదవ్ జత కలిశాడు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. అదే సమయంలో అశ్విన్ అడపా దడపా బౌండరీలు బాదుతూ భారత స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. దీంతో లంచ్ సమయానికి భారత జట్టు 348/7 స్కోరుతో నిలిచింది. అశ్విన్ హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 350 స్కోరు చేస్తే బంగ్లా ముందు భారీ లక్ష్యం ఉన్నట్లేనని విశ్లేషకుల అంచనా.

Story first published: Thursday, December 15, 2022, 11:42 [IST]
Other articles published on Dec 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+