తొలి బంతికే డకౌట్ కావాల్సినోడు దడదడలాడించాడు.. తొలుత మిస్సయినా మళ్లీ శ్రేయస్‌కే చిక్కాడు

ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా గట్టి పట్టుదలను కనబర్చుతుంది. ఈ సిరీస్ ఇప్పటికే భారత్ కైవసం అవడంతో ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్ ఫ్యాక్టర్ కాదు. ఈ మ్యాచ్ ఎలాగైన గెలిచి ముగింపుతో వీడ్కోలు పలకాలనే ఇంటెంట్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ప్రతిఘటన కనబర్చుతున్నారు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్‌కు ఓపెనర్లుగా డికాక్, బవుమా దిగారు.
ఇక దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే క్వింటన్ డికాక్ రనౌట్ కావాల్సింది. అతను స్ట్రెయిట్ ఆఫ్ సైడ్లో బంతి డ్రైవ్ చేయగా.. బంతి నేరుగా శ్రేయస్ అయ్యార్ చేతిలోకి వెళ్లింది. ఇక రన్ కోసం దాదాపు క్రీజులో సగం వరకు డికాక్ రాగా.. బవుమా వద్దన్నాడు. ఇక డికాక్ వెనుదిరగగా.. శ్రేయస్ అయ్యార్ డైరెక్ట్ స్ట్రైకర్ ఎండ్ వైపు త్రో వేశాడు. అది త్రుటిలో మిస్సయింది. అప్పటికీ వికెట్ల వెనకకు పంత్ రాలేకపోయాడు. దీంతో ఈజీ రనౌట్ మిస్సయింది.
శ్రేయస్ అయ్యార్ పర్ ఫెక్ట్ త్రో
ఇక లైఫ్ దక్కడంతో డికాక్ చెలరేగిపోయాడు. బవుమా (3) నిరాశపరిచినా.. డికాక్ (68పరుగులు 43బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సులు) దంచికొట్టాడు. మరో బ్యాటర్ రోసోవ్‌తో కలిసి రెండో వికెట్‌కు 90పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక 68పరుగుల వద్ద ఈసారి రెండో పరుగు కోసం ప్రయత్నించిన డికాక్‌ను శ్రేయస్ అయ్యార్ ఈసారి అద్భుతమైన త్రో వేయగా పంత్ వెంటనే అందుకుని వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. డికాక్ ఔటయ్యేసరికి స్కోరు 2వికెట్లు కోల్పోయి 12ఓవర్లకు 120కి చేరుకుంది.

ఇంకా యువ ప్లేయర్‌గానే ఫీలవుతా
ఇండోర్‌లో జరిగే సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20లో భారత్‌తో తలపడేముందు డికాక్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన కెరీర్ గురించి 30ఏళ్ల డికాక్ మాట్లాడుతూ.. సాధ్యమైనంత ఎక్కువ కాలం జట్టులో యంగ్ ప్లేయర్‌గా ఉండటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. 'నేను నా మునుపటి ఆట స్థితికి చేరుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది.
నేను ఇప్పటికీ జట్టులో యంగ్ ప్లేయర్‌లా ఫ్రెష్ ఇంటెంట్‌తో ఆడటానికి ప్రయత్నిస్తాను. సాధ్యమైనంత ఎక్కువ కాలం నేను కొనసాగడానికి ప్రయత్నిస్తాను. జట్టులోని నన్ను సీనియర్ అని పిలుస్తున్నప్పుడు ఆ మైండ్ సెట్ నాలోకి రానివ్వకుండా జాగ్రత్త పడతాను. అది నన్ను పట్టుకోకుండా యంగ్ ప్లేయర్‌గా ఫీలవుతాను.' అని డికాక్ చెప్పాడు. భారత్‌తో జరిగిన రెండో టీ20లో డేవిడ్ మిల్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అతను అలా ఆడకుంటే తాము అంత భారీ లక్ష్యానికి అంత చేరువయ్యే వాళ్లమే కామని డికాక్ చెప్పాడు.

మిల్లర్ ఆడకుంటే అంత క్లోజ్‌గా రాకపోయేవాళ్లం
'డేవిడ్ మిల్లర్ గత మ్యాచ్‌లో బాగా బ్యాటింగ్ చేశాడు. అతని ఇంటెంట్ మ్యాచ్‌లో ఏంటో నాకు స్పష్టంగా అర్థమైంది. తప్పకుండా గెలవాలనే కసిని అతను ప్రదర్శించాడు. ఛేదనలో తొలుత చాలా కష్టంగా ఇన్నింగ్స్ నడిచింది. అయినా మేము పోరాడాలని ప్రయత్నించాం. కానీ మేం లక్ష్యానికి అంత దగ్గరగా ఆగిపోతామని ఊహించలేదు.
మిల్లర్ అలాంటి ఇంటెంట్‌తో ఆడకపోతే మేం అంత చేరువగా వెళ్లేవాళ్లమే కాదు. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయిన తర్వాత అక్కడి దాకా చేరుకోవడం నిజంగా కొంచెం ఆనందంగా, కొంచెం బాధగా ఉంది. ఇది బిట్టర్ స్వీట్ విషయం. మేము ఓడిపోయినప్పటికీ మేము మిల్లర్ సెంచరీని చిన్నపాటి విజయంగా జరుపుకున్నాం.' అని డికాక్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications