Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లాష్‌బ్యాక్ 2019: No.4కు శ్రేయాస్ అయ్యర్ సరైనోడేనా?!!

Shreyas Iyer is the solution to Indias long-standing No.4 problem

హైదరాబాద్: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో భారత క్రికెట్ జట్టుకు ఇన్నాళ్లు నాలుగో నంబర్ అనేది సమస్య. మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్ తర్వాత ఆస్థాయి బ్యాట్స్‌మన్ టీమిండియాకు దొరుకలేదు. నాలుగో నంబర్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ చేయని ప్రయోగాలు లేవు, పరీక్షించని బ్యాట్స్‌మెన్ లేడు. ఏకంగా దాదాపు తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ నాలుగులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యాడు. ఈ సమయంలో భారత జట్టుకు యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఆపద్భాంధవునిలా దొరికాడు.

అవకాశం ఇస్తేనే కదా?:

అవకాశం ఇస్తేనే కదా?:

అద్భుత ప్రతిభ ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ రెండేళ్ల కిందటే టీమిండియాకు ఎంపికయ్యాడు. అయితే అతనికి సరైన అవకాశాలు రాలేదు. ఈ అసహనాన్ని అయ్యర్‌ మీడియా ఎదుట బహిరంగంగానే వెల్లడించాడు. అవకాశం ఇస్తేనే కదా? నిరూపించుకునేది అని అన్నాడు. అనంతరం అవకాశం వచ్చిన ప్రతీసారీ సద్వినియోగం చేసుకున్నాడు. ప్రపంచకప్‌ తర్వాత విండీస్ పర్యటనలోని రెండు వన్డేల్లో (71, 65 పరుగులతో) అర్ధ శతకాలతో రాణించాడు.

6, 6, 4, 6, 6 :

6, 6, 4, 6, 6 :

అయ్యర్‌ ఇటీవల బంగ్లాతో జరిగిన కీలక మూడో టీ20లో అర్ధ సెంచరీ (61) చేసి విజయంలో పాలుపంచుకున్నాడు. తాజాగా విండీస్‌తో జరిగిన టీ20లలో సరిగా ఆడే అవకాశం రాకున్నా.. తొలి వన్డేలో 70 పరుగులతో మెరిశాడు. కీలక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అద్భుతంగా ఆదుకున్నాడు. ఇక రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకే ఓవర్లో 6, 6, 4, 6, 6 బాది తనలోని పవర్ చూపించాడు. తాజా ప్రదర్శనలతో జట్టులో తన నాలుగో నంబర్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

 దిగ్గజాల ప్రశంసలు:

దిగ్గజాల ప్రశంసలు:

శ్రేయస్‌ అయ్యర్‌పై మాజీ దిగ్గజాలు అనిల్‌కుంబ్లే, రవిశాస్త్రి, రికీ పాంటింగ్‌.. ఎమ్మెస్కే ప్రసాద్‌ ప్రశంసల వర్షం కురిపించారు. నాలుగో నంబర్‌కు అయ్యర్‌రే సరైనోడు అని అంటున్నారు. అయ్యర్ ఇప్పటివరకు పది వన్డేలు ఆడి 52 సగటుతో 5 అర్ధ శతకాలు సాధించి, 416 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 54 మ్యాచ్‌ల్లో 52.18 సగటుతో 12 శతకాలు, 23 అర్ధ శతకాలు చేశాడు.

కెప్టెన్‌గానూ ప్రశంసలు:

కెప్టెన్‌గానూ ప్రశంసలు:

శ్రేయస్‌ ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. 2015లో ఢిల్లీ తొలిసారి అతడిని 2.6 కోట్లకు దక్కించుకుంది. ఆ సీజన్‌లో 439 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. తర్వాత 2018లో గంభీర్‌ తప్పుకున్నాక జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లోనే 411 పరుగులు చేసాడు. ఇక 2019లో బ్యాటింగ్‌లో రాణించడమే కాకుండా కెప్టెన్‌గానూ ప్రశంసలు పొందాడు. ఏడేళ్ల తర్వాత ఢిల్లీని ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు.

 నాలుగో స్థానం ఎంతో కీలకం:

నాలుగో స్థానం ఎంతో కీలకం:

క్రికెట్‌లో ఏ జట్టుకైనా నాలుగో స్థానం ఎంతో కీలకం. టాప్‌ఆర్డర్‌ బాగా ఆడితే అదే ఊపును ముందుకు తీసుకెళ్లాలి. ఒకవేళ విఫలమైతే ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాన వేసుకోవాలి. మ్యాచ్‌ పరిస్థితులను అర్థం చేసుకోవడమే కాకుండా.. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో రాణించాలి. ఇక అత్యంత నిలకడ కూడా ముఖ్యమే. వీటన్నింటికీ శ్రేయస్‌ సరిపోతాడు. ఇక నంబర్ నాలుగుకు పరిష్కారం దొరికినట్టేనా!!.

Story first published: Monday, December 23, 2019, 12:20 [IST]
Other articles published on Dec 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+