శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా వరల్డ్ రికార్డ్.. షేక్ ఆడించారు!!
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్‌లో గిల్, శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన చేయగా.. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా మంచిగా రాణించారు. ఈ నేపథ్యంలో శ్రేయస్, హర్షిత్ రాణా తలో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు.
నాలుగో స్థానంలో తొలి ప్లేయర్ గా
ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ప్రదర్శించిన శ్రేయస్ అయ్యర్.. వన్డే క్రికెట్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్ కు దిగి 50 కన్నా ఎక్కువ సగటు, 100 కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 1000కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా (ప్రపంచ క్రికెట్ లో) నిలిచాడు. అయ్యర్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఇతర స్థానాల్లో బ్యాటింగ్ కు దిగి ఈ ఫీట్ నమోదు చేసిన ప్లేయర్లు ఉన్నారు. వారిలో గిల్ రెండో స్థానంలో ఉండగా, ఏబీ డివిలియర్స్ ఐదో స్థానంలో నిలిచాడు.

రాణా కూడా తొలి ప్లేయర్ గా
ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా.. మొదట భారీగా పరుగులు సమర్ఫించుకున్నప్పటికీ ఆ తర్వాత మంచి ప్రదర్శన చేశాడు. మొత్తంగా మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 53 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో రాణా ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రంలోనే మూడు లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు.
రాణా వన్డే అరంగేట్రం ఇంగ్లాండ్ పై జరగగా.. అంతకుముందు టీ20 అరంగేట్రం కూడా ఇంగ్లాండ్ పైనే జరిగింది. రీసెంట్ గా ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టీ20లో మూడు వికెట్లు పడగొట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన రాణా.. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు సమర్పించుకని మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అలానే వన్డే అరంగేట్రంలో ఓ చెత్త రికార్డును కూడా నమోదు చేశాడు హర్షిత్ రాణా. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications