Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్..!

CSK vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్ తగిలింది. సీఎస్కేతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుత విజయాన్ని సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 209 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ మ్యాచ్‌‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌పై రూ.24 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఇలాంటి తప్పు చేయడం ఇది రెండోసారి కావడంతో శిక్ష తీవ్రత పెరిగింది. అంతకు ముందు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే తప్పు చేసినందుకు శ్రేయస్ అయ్యర్‌పై జరిమానా పడిన సంగతి తెలిసిందే.

ఆటగాళ్లకు కూడా జరిమానా
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయనందుకు కెప్టెన్‌తో పాటు జట్టు సభ్యులందరికీ శిక్ష తప్పలేదు. ప్లేయింగ్ ఎలెవన్‌లోని ప్లేయర్లతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌కు కూడా రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా విధించారు. వరుసగా తప్పులు పునరావృతం కావడం పట్ల బీసీసీఐ కఠినంగా వ్యవహరించింది.

Shreyas Iyer Fined Rs 24 Lakh Massive Penalty for Punjab Kings After Victory Against Chennai Super Kings

మ్యాచ్ పరిస్థితి ఇలా..
మ్యాచ్ విషయానికొస్తే.. జరిమానా పడినా పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్న అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే(73), శివం దూబే(45), సర్ఫరాజ్ ఖాన్(32) రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ రెండు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్, మార్కో యాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో 210 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడి 50 పరుగులు చేయగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (43), ప్రియాంశ్ ఆర్య (39), కూపర్ కాన్లీ (36) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో మాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ రెండేసి వికెట్లు తీసినప్పటికీ పంజాబ్ దూకుడును అడ్డుకోలేకపోయారు.

Story first published: Saturday, April 4, 2026, 9:31 [IST]
Other articles published on Apr 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+