Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బిగ్ షాక్!

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు సీఎస్కేను వారి సొంత మైదానంలో ఓడించగలిగింది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ తరఫున స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 72 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ శ్రేయస్ అయ్యర్ చేసిన తప్పుకు బీసీసీఐ జరిమానా విధించింది.

శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించబడింది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ చేసిన తొలి తప్పు ఇది. అందువల్ల శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది. ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అర్థ సెంచరీ, యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ కూడా చూడదగ్గవే. పంజాబ్ జట్టు సీఎస్కేను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. పరుగులను ఛేజ్ చేయడం తనకు ఇష్టమని అన్నాడు.

Shreyas Iyer Fined for Slow Over Rate Despite Heroics Against CSK

ఐపీఎల్ నిబంధనల ప్రకారం..
ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం శ్రేయస్ అయ్యర్‌కు ఈ జరిమానా విధించబడింది. ఐపీఎల్ నియమం 2.2 ప్రకారం ఒక జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే ఆ జట్టు కెప్టెన్ కు జరిమానా విధించబడుతుంది. మ్యాచ్ గెలిచిన అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. పెద్ద స్కోర్లను ఛేదించడం తనకు ఇష్టమని చెప్పాడు. ఏ మైదానంలోనైనా ఛేజింగ్ చేయడం ఇష్టమని తెలిపాడు. బోర్డులో పెద్ద స్కోరు ఉన్నప్పుడు బాధ్యత తీసుకుని జట్టుకు ఊపు ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. తద్వారా ఇతర బ్యాటర్ పూర్తి స్థాయిలో రాణించగలరని వెల్లడించాడు. అప్పుడే తాను మంచి అనుభూతిని పొందుతానని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.

Story first published: Thursday, May 1, 2025, 11:28 [IST]
Other articles published on May 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+