For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన శ్రేయస్: ధోనీ-రోహిత్ రికార్డు సమం

క్వాలిఫయిర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఘోర ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కేకేఆర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్‌లో తుదిపోరుకు చేరుకోవడం కోల్‌కతా‌కు ఇది నాలుగోసారి.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో, 7x4, 1x6) టాప్ స్కోరర్.ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (32; 21 బంతుల్లో, 3x4, 1x6), ప్యాట్ కమిన్స్ (30; 24 బంతుల్లో, 2x4, 2x6), అబ్దుల్ సమద్ (16; 12 బంతుల్లో, 2x6) మినహా మిగిలనెవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (3/34) మూడు, వరుణ్ చక్రవర్తి (2/26) రెండు వికెట్లతో సత్తాచాటాడు.

Shreyas Iyer Equals MS Dhoni and Rohit s Record for Most 50 Scores as Captain in Playoffs

అనంతరం ఛేదనకు దిగిన కేకేఆర్ 13.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. శ్రేయస్ అయ్యర్ (58*; 24 బంతుల్లో, 5x4, 4x6), వెంకటేశ్ అయ్యర్ (51*; 28 బంతుల్లో, 5x4, 4x6) అజేయ అర్ధశతకాలు సాధించారు. కమిన్స్ (1/38), నటరాజన్ (1/22) చెరో వికెట్ సాధించారు. అయితే కీలక దశలో ఫామ్‌లోకి వచ్చిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో 50+ స్కోరు అత్యధిక సార్లు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లతో కలిసి శ్రేయస్ అయ్యర్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ప్లేఆఫ్స్‌లో ధోనీ, రోహిత్, డేవిడ్, శ్రేయస్ రెండు సార్లు హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక మూడో వికెట్‌కు అభేద్యంగా 97 పరుగులు జోడించిన శ్రేయస్-వెంకటేశ్ అయ్యర్ జోడీ అరుదైన ఘనత నెలకొల్పింది.

ప్లేఆఫ్స్‌లో కేకేఆర్ తరఫున అత్యధిక భాగస్వామి నెలకొల్పిన రెండో జోడీగా శ్రేయస్-వెంకటేశ్ నిలిచారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో బిస్లా-కలిస్ ఉన్నారు. 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై బిస్లా-కలిస్ కలిసి 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

Story first published: Wednesday, May 22, 2024, 7:22 [IST]
Other articles published on May 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+