శ్రేయస్ ఎంత పెద్ద తప్పు చేశవయ్యా.. టీమిండియా బౌలర్లపై దండెత్తిన మిల్లర్, డుస్సెన్, సౌతాఫ్రికా విజయం

సౌతాఫ్రికా ముందు 212 పరుగుల భారీ టార్గెట్ చిన్నబోయింది. కిల్లర్ ది మిల్లర్ (64పరుగులు 31బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) దడదడలాడించగా.. రస్సీ వాన్ డర్ డుస్సెన్ (75పరుగులు నాటౌట్ 46 బంతుల్లో 7ఫోర్లు 5 సిక్సర్లు) చివర్లో బౌలర్లపై దండెత్తడంతో 212పరుగల భారీ స్కోరు హాంఫట్ అయింది. టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక ఛేజింగ్. వీరిద్దరి దంచుడుకు టీమిండియా బౌలర్లు అందరూ తేలిపోయారు. దీంతో మరో 5బంతులు మిగిలి ఉండగానే సౌతాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది.
వరుసగా 12 మ్యాచులు గెలిచిన టీమిండియా మరో మ్యాచ్ గెలిస్తే వరుసగా అత్యధిక టీ20మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా నిలిచేది. కానీ మిల్లర్, డుస్సెన్ టీమిండియా జైత్రయాత్రకు అడ్డుకట్ట వేశారు. నయా కెప్టెన్ రిషబ్ పంత్‌కు తొలి మ్యాచ్‌లో ఓటమి స్వాగతం పలికింది. ఇక ఈ మ్యాచ్‌లో వాన్ డర్ డుస్సెన్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ అయ్యార్ మిస్ చేయడం అతి పెద్ద తప్పిదంగా మారింది. ఇక లైఫ్ దక్కడంతో చివర్లో డుస్సెన్ పిచ్చకొట్టుడు కొట్టడంతో సౌతఫ్రికా ఈజీగా గెలిచింది. టీమిండియా బౌలర్లలో భువీ, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవ్వాళ అయిదు టీ20 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభమైంది. సిరీస్‌లో భాగంగా ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 211పరుగులు చేసింది. ఇక 212పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
భువీ వేసిన 3వ ఓవర్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (10పరుగులు 8బంతుల్లో) ఔటయ్యాడు. అనూహ్యంగా డ్వేన్ ప్రిటోరియస్ నంబర్ 3 బ్యాటర్ గా బరిలోకి దిగి ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఇక 4వ ఓవర్లో సిక్సుతో టచ్‌లోకి ప్రిటోరియస్ వచ్చాడు. ఆ ఓవర్లో డికాక్ సైతం రెండు ఫోర్లు బాదాడు. ఇక హార్దిక్ పాండ్యా వేసిన 5వ ఓవర్లో ప్రిటోరియస్ 3 సిక్సర్లు బాది స్కోరు మూమెంటమ్ ఛేంజ్ చేశాడు.

3 వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా పనైపోయిందనుకుంటే..
ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరి జోడీని హర్షల్ పటేల్ విడదీశాడు. 6 ఓవర్ రెండో బంతికి ప్రిటోరియస్ (29పరుగులు 13బంతుల్లో 1ఫోర్, 4సిక్సులు)ను బౌల్డ్ చేశాడు. ఇక క్రీజులోకి వచ్చిన వాన్ డర్ డుస్సెన్ కాస్త నిదానంగా ఆడాడు. ఇక 9వ ఓవర్లో అక్షర్ పటేల్.. డికాక్(22పరుగులు 18బంతుల్లో 3ఫోర్లు)ను ఔట్ చేశాడు. ఇక 9ఓవర్లు ముగిసేసరికి 82పరుగులకు 3వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమనే ఫీలింగ్ వచ్చింది. కానీ టీ20ల్లో ఏదైనా జరుగుతుందనేదానికి నిదర్శనంగా.. మిల్లర్, వాన్ డర్ డుస్సెన్ జోడీ పార్ట్ నర్ షిప్ నిలిచింది. 12వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో చివరి రెండు బంతులకు ఫోర్, సిక్సర్ కొట్టిన మిల్లర్ తన గేర్ మార్చాడు.

వామ్మో వన్ డర్ డుస్సెన్ నల్లినల్లిగా బ్యాటింగ్ చేస్తూ.. చివరికి
13వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో మిల్లర్ ఒక ఫోర్, రెండు సిక్సులు బాది స్కోరు బోర్డుకు మంచి మూమెంటమ్ తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అడపాదడపా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ 15వ ఓవర్ చివరి బంతికి మిల్లర్ 22బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 16వ ఓవర్ అవేష్ ఖాన్ బౌలింగ్లో వాన్ డర్ డుస్సెన్ ఇచ్చిన స్ట్రైట్ క్యాచ్‌ను శ్రేయస్ అయ్యార్ మిస్ చేశాడు. అప్పుడు డుస్సెన్ స్కోరు 31బంతుల్లో 29మాత్రమే. ఇక ఈ లైఫ్ దక్కడంతో అప్పటివరకు నల్లినల్లిగా ఆడిన వాన్ డర్ డుస్సెన్.. ఒక్కసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించాడు. 17వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్ వేయగా ఆ ఓవర్లో 3సిక్సులు, 1ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 18వ ఓవర్లో భువీ బౌలింగ్లో మిల్లర్ సిక్స్ కొట్టగా.. డుస్సెన్ సిక్స్, రెండు ఫోర్లు అందుకున్నాడు. 19వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన డుస్సెన్ గెలుపు అంతరాన్ని చివరి ఓవర్‌కు 4పరుగులకు తీసుకొచ్చాడు. చాహల్ వేసిన 20ఓవర్ తొలిబంతికి ఫోర్ బాదిన డుస్సెన్.. విజయ లాంఛనాన్ని ముగించాడు. ఇక తొలుత 32 బంతులకు 30పరుగులు చేసిన డుస్సెన్, ఇన్నింగ్స్ ముగిసేసరికి 45 బంతుల్లో 71పరుగులు చేశాడు. అంటే కేవలం 13బంతుల్లో అతను 41పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో అవార్డు విన్నర్లు వీరే
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - డేవిడ్ మిల్లర్
స్ట్రాంగెస్ట్ ఫర్ఫార్మర్ - డేవిడ్ మిల్లర్
డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ - రస్సీ వాన్ డర్ డుస్సెన్
వెన్యూ లిట్ ఫర్ఫార్మర్ - ఇషాన్ కిషాన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications