సూరీడుకి గుడ్ బై: T20 కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్..?
T20 World Cup 2026 విజేతగా భారత్‌ను గెలిపించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ తన టీ20 కెప్టెన్సీని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. IPL 2026 తర్వాత జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం శ్రేయాస్ అయ్యర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడమే కాకుండా అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
సూర్యకుమార్ యాదవ్ ఇటీవలి కాలంలో బ్యాటింగ్‌లో ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోవడంపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ గెలిచిన తర్వాత జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాలని సెలెక్టర్లు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్‌ను జట్టుకు కెప్టెన్ గా చేయాలని వారు భావిస్తున్నారు. గతంలో సూర్యకుమార్ టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ ప్రస్తుతం ఫామ్ ఆందోళనకరంగా ఉండటంతో కనీసం బ్యాటర్‌గానైనా జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నది అనుమానంగా మారింది.

సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్‌ను కోల్పోవడానికి మణికట్టు గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తీవ్రమైన నొప్పితో అసౌకర్యంగా ఉన్నప్పటికీ జట్టు కోసం ఆయన గ్రౌండ్ లోకి దిగుతున్నారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ గాయం కారణంగానే ఆయన తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించలేకపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం అతనికి కలిసి వస్తోంది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరింటిని గెలిపించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 333 పరుగులు సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ బలమైన ప్రదర్శనే తిరిగి జట్టులోకి రావడానికి కెప్టెన్సీ రేసులో నిలబడటానికి సహాయపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

