For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్ తప్పుడు నిర్ణయమే మమ్మల్ని ఓడించింది: అయ్యర్ (వీడియో)

Shreyas Iyer certain that umpires made an error at calling Shane Watsons review off first ball

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా జరిగిన 30వ మ్యాచ్‌లో ఢిల్లీతో చెన్నై తలపడింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు 212పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కుప్పకూలింది. దీనిపై ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్‌ అయ్యర్‌ స్పందించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ..అంపైర్‌ తప్పుడు నిర్ణయం వల్లె ఓటమి పాలయ్యామని, తొలి బంతికే చెన్నై బ్యాట్స్‌మన్‌ షేన్‌ వాట్సన్‌ ఔట్‌ అయినప్పటికి అంపైర్లు ఇవ్వలేదని ఆరోపించాడు.

 అవుట్ అయినా అవలేదని:

అవుట్ అయినా అవలేదని:

మ్యాచ్ మొదలవగానే ఓపెనర్‌గా స్ట్రైకింగ్‌లో ఉన్న షేన్ వాట్సన్ తొలి బంతిని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తొలి బంతినే రివ్యూ కోరింది ఢిల్లీ జట్టు. థర్డ్ అంపైర్ కూడా నాటౌట్ అని తేల్చడంతో.. వాట్సన్ బ్యాట్ ఝుళిపించి భారీ స్కోరు నమోదు చేశాడు. అది తప్పుడు నిర్ణయమని, తనతో పాటు డ్రెసింగ్స్‌ రూం కూడా వాట్సన్‌ ఔటేనని భావిస్తుందని అయ్యర్ వాపోయాడు. ఈ తప్పిదంతో వాట్సన్‌ చెలరేగాడని దీంతో భారీ లక్ష్యం నమోదైందని.. ఇది తమ జట్టుపై పెద్ద ప్రభావం చూపిందని అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారంపై మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు.

ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌:

చెన్నై ఇన్నింగ్స్‌.. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన తొలి బంతికే వాట్సన్‌ వికెట్ల ముందు దొరకగా.. ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. దీంతో ఢిల్లీ రివ్యూ కోరింది. అయితే ధర్డ్‌ అంపైర్‌ సైతం బంతి బ్యాట్‌కు తగిలిందని సందేహం వ్యక్తం చేస్తూ బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా నాటౌట్‌ ఇచ్చాడు. అయితే వీడియోలో మాత్రం స్పష్టమైన ఔట్‌గానే కనిపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాట్సన్‌ 40 బంతుల్లో (78)చెలరేగడంతో 13 పరుగులతో ఢిల్లీ ఓడిపోయింది.

విజయానికి చేరువగా వచ్చాం:

విజయానికి చేరువగా వచ్చాం:

మ్యాచ్ వైఫల్యం గురించి స్పందిస్తూ.. 'విజయానికి చేరువగా రావడం శుభపరిణామమని ఈ యువ సారథి ఆనందం వ్యక్తం చేశాడు. ‘ మేం నిజంగా విజయానికి చేరువగా వచ్చాం. ఇది మా తదుపరి మ్యాచ్‌కు ఉపయోగపడుతోంది. టోర్నీలో ఇంకా మేం ఆడాల్సిన ప్రతి మ్యాచ్‌ను ఖచ్చితంగా గెలవాలి. మా తప్పిదాలను గుర్తించి.. వాటి సరిదిద్దుకొని విజయాల కోసం ప్రయత్నిస్తాం. మేం మేనేజ్‌మెంట్‌తో సమావేశమై జట్టు కూర్పుపై చర్చిస్తాం. ఇదే విధంగా జట్టుగా ముందుకు కొనసాగుతాం. తదుపరి మ్యాచ్‌లో రాణిస్తామని' అయ్యర్‌ తెలిపాడు.

అప్రమత్తంగా వ్యవహరించాలని చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా:

అప్రమత్తంగా వ్యవహరించాలని చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా:

ఈ సీజన్‌లో అంపైర్లు తప్పిదాలపై అభిమానులు ఇప్పటికే అగ్రహం వ్యక్తంచేశారు. చెన్నై-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో స్పష్టమైన నోబాల్‌ను ఇవ్వకపోవడం, రాజస్తాన్‌-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో ఓవర్‌లో 7 బంతులు వేయించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా సైతం సూచించారు. చెన్నై జట్టు ఆడే మ్యాచ్ లలోనే కావాలని అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో ఆ జట్టుకు మద్దతు తెలుపుతున్నారని అభిమానులు మండిపడుతున్నారు.

Story first published: Tuesday, May 1, 2018, 16:34 [IST]
Other articles published on May 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+