Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shreyas Iyer: కెప్టెన్సీలో చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ధోనీ రికార్డ్ బ్రేక్!!

Shreyas Iyer: కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో కొత్త రూపు సంతరించుకుంది పంజాబ్‌ కింగ్స్‌ జట్టు. ఈ ఐపీఎల్ సీజన్ లో దూసుకెళ్తోంది. మొదటి మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్ ను ఓడించిన ఆ జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచులోనూ మరింత దూకుడుగా ఆడి లక్నోను దాని సొంతగడ్డపై చిత్తుగా ఓడించింది. పాయింట్ల పట్టికలోనూ రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. సీఎస్కే స్టార్ బ్యాటర్ ధోనీ సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు.

రికార్డు ఏంటంటే
కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కు ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం విశేషం. ఇందులో గతేడాది కేకేఆర్ తరఫున సారథిగా ఆరు విజయాలు సాధించాడు. ఇక ఇప్పుడు పంజాబ్ తరఫున కెప్టెన్ గా రెండు విజయాలను అందుకున్నాడు. తద్వారా షేన్ వార్న్ రికార్డుతో సమంగా నిలవంగా ధోనీ రికార్డును అధిగమించాడు. అంతకుముందు మహీ కెప్టెన్ గా ఏడు వరుస విజయాలతో మూడో స్థానంలో నిలిచాడు. గౌతమ్ గంభీర్ 10 వరుస విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Shreyas Iyer breaks MS Dhoni s captaincy record in IPL after Punjab kings beats LSG

కెప్టెన్ గా ఎక్కువ వరుస విజయాలు అందుకున్న ఆటగాళ్లు వీరే..
10 - గౌతమ్ గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) - 2014-15
8 - షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్) - 2008
8 - శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్) - 2024-25
7 - ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్ ) - 2013
6 - గౌతమ్ గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) - 2012
6 - ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) - 2014
6 - కేన్ విలియమ్సన్ (సన్ రైజర్స్ హైదరాబాద్) - 2018
6 - ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) - 2019
6 - ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) - 2024

Story first published: Wednesday, April 2, 2025, 12:07 [IST]
Other articles published on Apr 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+