For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shreyas iyer costly car: శ్రేయస్ అయ్యర్ కారు ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.. మెర్సిడెస్‌లోనే అగ్రశ్రేణి కారు

Shreyas Iyer Bought Costly Mercedes-Benz G 63 Which Costs INR 2.45Crore

టీమిండియా స్టార్ ప్లేయర్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కాస్ట్ లీ కార్ కొన్నది. అతను Mercedes-AMG G 63 4Matic SUVని రూ.2.45కోట్ల ధరతో కొనుగోలు చేసింది. అయ్యర్ ఈ కారు డెలివరీని అందుకున్న ఫోటోలను మెర్సిడిస్ యొక్క ప్రముఖ డీలర్‌ ల్యాండ్ మార్క్ తన సోషల్ మీడియోలో పోస్టుచేసింది. 'భారత క్రికెటర్ మిస్టర్ శ్రేయాస్ అయ్యర్‌కి సరికొత్త మెర్సిడెస్-బెంజ్ G 63ని డెలివరీ చేసినందుకు సంతోషంగా ఉంది. శ్రేయస్ అయ్యార్‌కు అభినందనలు. ఈ కారు విలక్షణమైన డిజైన్‌తో కన్పిస్తుంది.

శ్రేయస్ అయ్యార్‌ను మా మెర్సిడెస్ కుటుంబంలోకి స్వాగతిస్తున్నాము. మీ కవర్ డ్రైవ్‌లను చూసి మేము ఎంత ఆనందిస్తామో, మీరు కూడా మా మెర్సిడెస్ డ్రైవింగ్‌ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం' అని పేర్కొంది. మెర్సిడెస్ -AMG G 63 4Matic అనేది ప్రసిద్ధ G -వ్యాగన్ సిరీస్‌లో అగ్ర వేరియంట్ కారు. ఈ కారు AMG 4.0-లీటర్ V8 బిటుర్బో ఇంజన్‌తో 430 kW (585 hp) అవుట్‌పుట్, 850 Nm గరిష్ఠ టార్క్‌తో పనిచేస్తుంది. ఇక దీని వేగం మామూలుగా ఉండదు. కేవలం 4.5సెకన్లలో 0నుండి 100కి.మీ/గం వేగాన్ని ఈ కారు అందుకోగలదు.

ఇకపోతే శ్రేయస్ అయ్యర్ దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20సిరీస్‌‌కు ఎంపికయ్యాడు. ఇక టీమిండియా దక్షిణాఫ్రికాతో జూన్ 9న న్యూ ఢిల్లీలో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత కటక్‌లో జూన్ 12న రెండో టీ20, జూన్ 14న విశాఖపట్నంలో మూడో టీ20, జూన్ 17న రాజ్‌కోట్‌లో నాలుగో టీ20, జూన్ 19న బెంగళూరులో చివరి మ్యాచ్ జరగనుంది. ఇక బీసీసీఐ ఈ సిరీస్‌లో టీమిండియా జట్టుకు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించింది.

కేకేఆర్ కెప్టెన్‌గా అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో మాత్రం కాస్త మిశ్రమ అనుభూతిని పొందాడు. కేకేఆర్ ఈ సీజన్లో ఏడో స్థానంలో నిలిచింది. 14మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన కేకేఆర్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇకపోతే దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Thursday, June 2, 2022, 14:43 [IST]
Other articles published on Jun 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+