Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: శ్రేయస్ ఆల్‌టైమ్ రికార్డు: చరిత్రలో ఒకే ఒక్కడు

టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు చేరింది. ఐపీఎల్-2024లో ఛాంపియన్‌గా నిలవడానికి అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో తుదిపోరుకు చేరుకోవడం కోల్‌కతా‌కు ఇది నాలుగో సారి.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో, 7x4, 1x6) టాప్ స్కోరర్.ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (32; 21 బంతుల్లో, 3x4, 1x6), ప్యాట్ కమిన్స్ (30; 24 బంతుల్లో, 2x4, 2x6), అబ్దుల్ సమద్ (16; 12 బంతుల్లో, 2x6) మినహా మిగిలనెవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు.

Shreyas Iyer Becomes First Captain to Lead Two IPL Franchises to the Final

కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (3/34) మూడు, వరుణ్ చక్రవర్తి (2/26) రెండు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనకు దిగిన కేకేఆర్ 13.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. శ్రేయస్ అయ్యర్ (58*; 24 బంతుల్లో, 5x4, 4x6), వెంకటేశ్ అయ్యర్ (51*; 28 బంతుల్లో, 5x4, 4x6) అజేయ అర్ధశతకాలు సాధించారు. కమిన్స్ (1/38), నటరాజన్ (1/22) చెరో వికెట్ సాధించారు.

అయితే కోల్‌కతా నైట్ రైడర్స్‌ను తుది పోరుకు అర్హత సాధించిన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా శ్రేయస్ చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను శ్రేయస్ ఫైనల్‌కు చేర్చాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ వదులుకోవడంతో కేకేఆర్‌కు వచ్చిన శ్రేయస్ మరోసారి తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించాడు.

లీగ్ దశలో విజయాలతో హోరెత్తించి పాయింట్ల పట్టికలో కోల్‌కతాను అగ్రస్థానంలో నిలిపాడు. క్వాలిఫయిర్-1లోనూ జట్టును గొప్పగా నడిపించాడు. బౌలర్లను, ఫీల్డర్లను చక్కగా ఉపయోగించి ఎస్‌‌ఆర్‌హెచ్ బ్యాటర్లను కట్టడి చేశాడు. కాగా, క్వాలిఫయిర్-2 విజేతతో చెపాక్ వేదికగా ఆదివారం కేకేఆర్ ఫైనల్ ఆడనుంది.

Story first published: Wednesday, May 22, 2024, 10:49 [IST]
Other articles published on May 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+