India Playing 11 : వెస్టిండీస్‌తో మూడో టీ20కి శ్రేయస్ అయ్యర్, అవేష్ ఖాన్ ఔట్, వారి ప్లేస్‌లో వీరిద్దరు

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలిచి సిరీస్‌ను 1-1తేడాతో సమం చేసిన సంగతి తెలిసిందే. తొలుత భారత్ 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటయింది. ఒబెడ్ మెక్‌కాయ్ ఆరు వికెట్లు పడగొట్టి టీమిండియా బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. వెస్టిండీస్ ఛేదనలో తమ చివరి ఓవర్‌లో గెలవడానికి 10పరుగులు కావాల్సిన తరుణంలో.. డెవాన్ థామస్ (19 బంతుల్లో 31 పరుగులు) ఫినిషింగ్ లైన్ దాటించి విండీస్‌ను గెలిపించాడు. అంతకుముందు బ్రాండన్ కింగ్ (68పరుగులు) రాణించాడు. అవేష్ తన 2.2ఓవర్లలో 31పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో నోబాల్ వేయడంతో పాటు సిక్స్, ఫోర్ ఇచ్చి తొలి రెండు బంతులకే విండీస్ గెలుపొందేలా చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో అతను అత్యంత ఎక్స్ పెన్సివ్ బౌలర్.

మళ్లీ మారిన టైమింగ్స్.. మళ్లీ ప్రయోగానికే మొగ్గు..!
ఇకపోతే ఈ రోజు కూడా సేమ్ మైదానంలో మ్యాచ్ జరగబోతుంది. మ్యాచ్ టైమింగ్స్ మళ్లీ మారాయి. రాత్రి 8గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. 9.30కు ప్రారంభం కాబోతుంది. మ్యాచ్ ముగిసేసరికి 1గంట అవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ప్లేయింగ్ 11లో మార్పులు తథ్యంగా ఉండనున్నాయి. బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో దీపక్ హుడా, బౌలింగ్లో అవేశ్ ఖాన్ స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగే వీలుంది. ఇక వన్డే సిరీస్ 2వ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ వీరోచితంగా ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా ముగ్గురు స్పిన్నర్లతో ప్రయోగానికి టీం మేనేజ్ మెంట్ సిద్ధమయ్యే అవకాశాలున్నాయి.

మిగతా వాళ్లకు కూడా సిరీస్ ముగిసే లోపు అవకాశాలు
ఇకపోతే అవేష్ ఖాన్‌ను తప్పించడానికి నిన్నటి మ్యాచ్ ప్రదర్శన రీజన్ కాదు. ఎందుకంటే ప్రయోగ పద్ధతిలో అతని చేత బౌలింగ్ వేయించినట్లు రోహిత్ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. అనూహ్యంగా మూడో మ్యాచ్‌లోనూ అతన్ని రోహిత్ తీసుకునే వీలు కూడా ఉంది. అయితే ఈ సిరీస్లో ప్రయోగాలకే ఎక్కువగా మొగ్గుచూపుతున్న రోహిత్ అతని ప్లేస్‌లో అక్షర్ పటేల్‌ను తీసుకోవడమే దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్‌లకు కూడా సిరీస్లో భాగంగా అవకాశాలు దక్కుతాయి.

తుది జట్ల అంచనా
వెస్టిండీస్ :
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, డెవాన్ థామస్ (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
ఇండియా :
రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications