అయ్యర్ సగటు ఎంత?
3 మ్యాచ్‌ల్లో మొత్తంగా శ్రేయస్ అయ్యర్ 204 పరుగులు చేశాడు. అయితే ప్రస్తుతం దీని గురించే ఓ సమస్య వచ్చి పడింది. అదేమిటంటే 3 మ్యాచ్‌ల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్క సారి కూడా ఔట్ కాకుండా నాటౌట్‌గా నిలవడంతో ఈ సిరీస్‌లో అతడి పరుగుల సగటును ఎలా లెక్కించాలనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రముఖ క్రీడా పోర్టల్ అయినా క్రిక్ బజ్‌లో సైతం శ్రేయస్ అయ్యర్ స్కోర్‌కు సంబంధించిన సగటును నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.

ఫన్నీ వాట్సాప్ చాటింగ్
శ్రేయస్ అయ్యర్ సగటు లెక్కింపునకు సంబంధించిన ఓ ఫన్నీ వాట్సాప్ చాటింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ చాటింగ్‌లో ఓ వ్యక్తి శ్రీలంకతో టీ20 సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ 3 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడని, ఇప్పుడు సిరీస్‌లో అతడి పరుగుల సగటును ఎలా లెక్కించాలని మరో వ్యక్తిని అడిగాడు. అయితే మొత్తం 3 మ్యాచ్‌లలో ఔట్ కాకపోతే ఆటగాడి పరుగుల సగటును ఎలా లెక్కించాలో తనకు కూడా తెలియదని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. దీంతో ఈ చాటింగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్టుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజ్‌మెంట్ ఎవరైనా సహాయం చేయగలరా అని రాసుకొచ్చింది. కాగా శ్రేయస్ అయ్యర్ ఈ సారి ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
క్రిక్‌బజ్‌లో సైతం
క్రికెట్ గురించి, క్రికెట్ పరంగా ఆటగాళ్ల వ్యక్తి గత రికార్డులు, పరుగులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే ప్రముఖ వెబ్‌పోర్టల్ క్రిక్‌బజ్ కూడా శ్రీలంకతో సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ పరుగుల సగటును లెక్కించ లేకపోవడం గమనార్హం. క్రిక్‌బజ్ పోర్టలో శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో సిరీస్‌లో చేసిన పరుగులు, బౌండరీలు, సిక్సులు, స్ట్రైక్‌రేట్ అన్ని నమోదు చేసి ఉన్నాయి. పరుగులు 204గా, 20 ఫోర్లు, 7 సిక్సులు బాదాడని, స్ట్రైక్‌రేట్ 174గా , 3 మ్యాచ్‌లు 3 నాటౌట్లుగా ఉంది. కానీ సగటు స్థానంలో ఎటువంటి సంఖ్య వేయకుండా ఖాళీగా ఉంది. దీంతో శ్రేయస్ అయ్యర్ సగటు క్రిక్‌బజ్‌కు కూడా తెలియదని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌గా చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

జడేజా సగటు సైతం
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ సగటు సైతం క్రిక్ బజ్‌లో అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 70 పరుగులు చేసినట్లు వేసిన క్రిక్‌బజ్ అతని సగటు మాత్రం నమెదు చేయలేదు. జడేజా కూడా 3 మ్యాచ్‌ల్లో ఒక సారి కూడా ఔట్ కాకుండా నాటౌట్‌గా నిలిచాడు. 189 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన జడేజా 10 ఫోర్లు, ఒక సిక్సు బాదాడు.


Click it and Unblock the Notifications












