INDvsBAN: ఆదుకున్న పుజారా, శ్రేయాస్.. చివరి బంతికి మరో వికెట్..!

బంగ్లాదేశ్ తో జరుగుతున్నా మొదటి టెస్టు మ్యాచులో భారత జట్టును శ్రేయాస్ అయ్యర్, ఛటేశ్వర్ పుజారా ఆదుకున్నారు. చట్టోగ్రాం వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత ఇన్నింగ్స్ అనుకున్నట్లు సాగలేదు. పేలవమైన ఆరంభంతో కష్టాల్లో పడిన జట్టును మిడిల్ ఆర్డర్ ఆడుకుంది. దీంతో భారత్ మంచి స్కోరు చేసే దిశగా సాగుతోంది.
టాప్ ఆర్డర్ మళ్ళీ విఫలం..
ఆరంభంలో కుదురుకున్నట్లే కనిపించిన శుభ్ మన్ గిల్ (20) అవసరమైన షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే కేఎల్ రాహుల్ (22) కూడా నిష్క్రమించాడు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతను కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (46) మరో వికెట్ పడకుండా అడ్డుకున్నాడు.
లంచ్ తర్వాత పంత్ అవుట్..
కానీ లంచ్ తర్వాత అతను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మెహదీ హసన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడి, ఆ మరుసటి బంతికే వెనుతిరిగాడు. హసన్ వేసిన బంతిని ఎదుర్కొనేందుకు పంత్ రూం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీంతో పంత్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. ఇలా ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరోపక్క పుజారా (90) మాత్రం గోడలా నిలబడ్డాడు.
అయ్యర్, పుజారా క్లాసిక్..
అతనికి జత కలిసిన శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పుజారా అవుటైన తర్వాత కూడా నిలకడగా రాణించాడు. అతనికి అక్షర్ పటేల్ (14) కొంత సహకారం అందించాడు. కలిసి భారత స్కోరును 278 కి చేర్చారు. ఇక మరొక బంతి వేస్తే రోజు ఆట ముగుస్తుంది అనగా.. మెహదీ హసన్ మరోసారి భారత జట్టును దెబ్బతీసాడు. అతని బౌలింగ్ లో అక్షర్ పటేల్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
చివరి బంతికి వికెట్..
దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 278/6 స్కోరుతో నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ అజేయంగా నిలబడి ఉన్నాడు. రేపు అయ్యర్, అశ్విన్ కలిసి ఎంత స్కోర్ చేస్తే భారత జట్టుకు అంత మంచిది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3, మెహదీ హసన్ 2 వికెట్లు తీసుకోగా.. ఖలీద్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications