For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరిచిపోలేని రాత్రి..కోహ్లి అలా పిలుస్తాడని అనుకోలేదు - శ్రేయాంక

శ్రేయాంక పాటిల్.. గత కొన్ని రోజులుగా ఈ పేరు మార్మోగుతోంది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే లేదా క్రికెట్ అభిమాని అయితే.. శ్రేయాంక పాటిల్ సుపరిచితమే. 21 ఏళ్ల శ్రేయాంక బౌలింగ్ ఆల్‌రౌండర్. ఆఫ్‌స్పిన్‌‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడమే కాకుండా బ్యాటుతోనూ సత్తాచాటే సామర్థ్యం ఆమె సొంతం. పిచ్ కాస్త స్పిన్‌‌కు అనుకూలిస్తే తనలో బీస్ట్ మోడ్ యాక్టివ్ అవుతుంది.

ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ టీమ్ ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటింది. అంతేగాక టోర్నీలో 13 వికెట్లు సాధించిన ఆమె అత్యధిక వికెట్ల వీరవనితగా రికార్డు సాధించింది. పర్పుల్ క్యాప్‌తో పాటు 'ఎమెర్జింగ్ ప్లేయర్' అవార్డు సొంతం చేసుకుంది.

Shreyanka Patil Virat Kohli actually knows my name

ఇక కరేబియన్ లీగ్‌లో ఆడిన ఏకైక భారత ప్లేయర్‌గా శ్రేయాంక అరుదైన ఘనత సాధించింది. వెస్టిండీస్ పిచ్‌లపై తన సత్తా ఏంటో చాటిచెప్పింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనూ మెరిసింది. ఆర్సీబీ 16 ఏళ్ల ట్రోఫీ కలను నెరవేర్చడంలో ముఖ్య పాత్ర పోషించింది. అంతేగాక మరికొన్ని నెలల్లో జరగనున్న మహిళా టీ20 ప్రపంచకప్‌కు భారత అమ్ములపొదిలో కొత్త అస్త్రంగా మారింది.

అయితే శ్రేయాంక పాటిల్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పెట్టింది. తన క్రికెట్ ఆరాధ్య దైవం అయిన విరాట్ కోహ్లిని కలుసుకున్నాని, అంతేగాక కోహ్లి తనని పేరు పెట్టి పిలిచాడని శ్రేయాంక తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ''క్రికెట్ చూడటానికి కారణం అతనే. అతనిలా అవ్వాలనే కలలు కంటూ పెరిగాను. నిన్న రాత్రి జీవితంలో మరిచిపోలేను. విరాట్.. 'హేయ్ శ్రేయాంక, బాగా బౌలింగ్ చేశావు' అని అన్నాడు. అతడిని నా పేరు తెలిసింది'' అని శ్రేయాంక ట్వీట్ చేసింది.

మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ సందర్భంగా ఆర్సీబీ ఉమెన్స్ టీమ్‌తో కలిసి కోహ్లి ముచ్చటించాడు. కప్ సాధించినందకు అభినందనలు తెలిపాడు. కానీ స్టార్ క్రికెటర్ అయిన కోహ్లి తన పేరును గుర్తు పెట్టుకొని అలా పిలవడంతో యువ క్రికెటర్ శ్రేయాంక సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయింది.

Story first published: Wednesday, March 20, 2024, 19:20 [IST]
Other articles published on Mar 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+