ఆయనే నా రోల్ మోడల్: శ్రేయాంక పాటిల్
ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైన తరుణంలో భారత మహిళా స్టార్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ తన రోల్ మోడల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. స్టేడియంలో ప్రతిరోజూ తనను అత్యంత ప్రభావితం చేసే ఏకైక క్రికెటర్ టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అని ఆమె వెల్లడించారు. మెగా టోర్నీకి ముందు ఐసీసీ విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియోలో శ్రేయాంక మాట్లాడుతూ.. కోహ్లీపై తనకున్న అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు.
మహిళల టీ20 వరల్డ్ కప్ జూన్ 12 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడడం ద్వారా తన ప్రపంచ కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ కీలక సమరానికి సన్నద్ధమవుతున్న తరుణంలో శ్రేయాంక పాటిల్ విరాట్ కోహ్లీని 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అంటూ అభివర్ణించింది. విరాట్ కోహ్లీ కేవలం ఆటపరంగానే కాకుండా ఆయనకున్న ఫిట్‌నెస్, క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడే తత్వం తనను ఎంతగానో ప్రేరేపిస్తాయని ఆమె పేర్కొంది

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ ఫ్రాంచైజీకే తాను ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల కోహ్లీతో ఉన్న బంధం మరింత బలంగా మారిందని శ్రేయాంక తెలిపారు. "నేను ఆర్సీబీ అమ్మాయిని కావడం, ఆయన కూడా అదే ఫ్రాంచైజీకి ఆడడం నాకు గర్వకారణం. క్రికెట్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఫిట్‌నెస్ లెవెల్స్, హార్డ్ వర్క్ ఇలా అన్ని విషయాలను కలిపి చూస్తే ఆయన నిజంగా ఒక గ్రేట్ పర్సన్" అని శ్రేయాంక పాటిల్ కొనియాడింది.
ఇదే సమయంలో తన కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని ఓ మధురమైన క్షణాన్ని శ్రేయాంక పాటిల్ గుర్తుచేసుకుంది. 2024లో ఆర్సీబీ మహిళల జట్టు తొలిసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ సమయంలో పురుషుల జట్టు ఆటగాళ్లు వీరికి ఘనస్వాగతం పలికారు. అప్పుడు విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా తన దగ్గరకు వచ్చి "వెల్ డన్, శ్రేయాంక" అని అభినందించారని, ఆ మాట విన్నప్పుడు తనకు మాటలు రాలేదని, ఆ 'వావ్' మూమెంట్‌ను తాను జీవితంలో మర్చిపోలేనని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ పురుషుల జట్టు కూడా టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని డిఫెండ్ చేసుకున్న మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చారిత్రాత్మక విజయాల్లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆయన 165.85 అనే కెరీర్ బెస్ట్ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 675 పరుగులు సాధించి సత్తా చాటారు. కాగా కోహ్లీ త్వరలోనే స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications