
టెస్టు సిరీస్‌లో రోహిత్‌కు అవకాశం దక్కుతుందని
ప్రస్తుత ఫామ్, ఇంగ్లాండ్‌లో కోహ్లి సేన ఘోర ఓటమి అనంతరం వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో రోహిత్‌కు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ సెలక్టర్లు ఆశ్చర్యకరంగా మరోసారి రోహిత్‌ను పక్కకు పెట్టేశారు. టెస్టులకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల ఇప్పటికే సౌరవ్ గంగూలీ, హర్బజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలో మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా కూడా చేరారు.

రోహిత్ .. ఒకటి రెండు టెస్టుల్లో విఫలమైనా
‘టెస్టుల్లో విదేశీ పిచ్‌లపై ప్రస్తుతమున్న ఆటగాళ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లి తర్వాత ఎక్కువ పరుగులు చేసింది రోహిత శర్మనే. కానీ సెలక్టర్లు అతడిపై ఎందుకు నమ్మకం ఉంచడంలేదు. గత ఐదు టెస్టు సిరీస్‌ల నుంచి అతడిని పక్కకు పెట్టారు. ఒకటి రెండు టెస్టుల్లో రోహిత్ విఫలమవ్వచ్చు. కానీ వరుస అవకాశాలు ఇస్తేనే రోహిత్ తానేంటో నిరూపించుకుంటాడు. పరిమిత క్రికెట్‌లో తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. టెస్టుల్లో కూడా సెలక్టర్లు అవకాశాలు ఇవ్వాలి.'అంటూ నిఖిల్ చోప్రా తెలిపారు.

విజయ్, ధావన్‌లను పక్కకు పెట్టి
విదేశాల్లో రోహిత్ శర్మ ప్రదర్శన చూస్తే 14 టెస్టుల్లో 58 సగటుతో 583 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 25 టెస్టుల్లో 39.97 సగటుతో 1479 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెలక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న రెగ్యులర్ ఓపెనర్లు విజయ్, ధావన్‌లను పక్కకు పెట్టి కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్, ముంబై యువ సంచలనం పృథ్వీ షాలను ఎంపిక చేసింది.

బుమ్రా.. పాండ్యాలకు విశ్రాంతి..
ఇదిలా ఉంచితే వెస్టిండీస్‌తో జరగబోయే టోర్నీ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన చేయాల్సి ఉంది. ఈ పర్యటనకు ముందు స్టార్ ప్లేయర్లందరికీ విశ్రాంతినిచ్చే క్రమంలోనే వారిని జట్టులోకి తీసుకోలేదని సెలక్టర్లు ముందుగానే చెప్పుకొచ్చారు. ఇదే తరహాలో కోహ్లీకి ఆసియా కప్ జట్టులోనూ స్థానం కల్పించక దూరంగా ఉంచింది. ప్రస్తుత సిరీస్‌కు ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో గాయాలతో ఇబ్బందులు పడిన బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్, జస్ప్రిత్ బుమ్రా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు సైతం విశ్రాంతినిచ్చారు.


Click it and Unblock the Notifications












