
నెట్ ప్రాక్టీస్‌లో స్మిత్ భుజానికి గాయం
వన్డే సిరీస్ అనంతరం తొలి టీ20 కోసం రాంచీ చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజానికి గాయమైంది. దీంతో వెంటనే స్మిత్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు జరిపించారు. పనిలో పనిగా ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ కూడా చేయించారు.

స్టీవ్ స్మిత్ ఫిట్‌గా ఉన్నాడని చెప్పినా
అనంతరం పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎటువంటి సమస్యలేదని, స్టీవ్ స్మిత్ ఫిట్‌గా ఉన్నాడని తొలి టీ20లో పాల్గొనచ్చని వైద్యులు చెప్పడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఊపిరిపీల్చుకుంది. త్వరలో ఇంగ్లాండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్ జరగనున్న నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ స్మిత్‌కు విశ్రాంతి ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకుంది.

స్మిత్ స్థానాన్ని మార్కస్ స్టోయినిస్‌తో భర్తీ
దీనిని దృష్టిలో పెట్టుకునే స్మిత్‌ను స్వదేశానికి పంపించివేసినట్లు తెలుస్తోంది. స్మిత్ స్థానాన్ని మార్కస్ స్టోయినిస్‌తో భర్తీ చేయనున్నామని, ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ మూడు టీ20ల సిరిస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం అధికారిక ప్రకటన చేసింది.

రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా
భారత పిచ్‌లపై ఐపీఎల్ ద్వారా అనుభవాన్ని సంపాదించిన స్టీవ్ స్మిత్ దూరమవ్వడం ఆ జట్టుకు గట్టి దెబ్బేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్ పదో సీజన్‌లో స్టీవ్ స్మిత్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో స్మిత్ కీలకపాత్ర పోషించాడు.


Click it and Unblock the Notifications











