Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాకు షాక్.. ప్రపంచకప్‌ నుండి రిచర్డ్‌సన్‌ ఔట్

Shoulder injury rules Jhye Richardson out of World Cup, Kane Richardson called up

ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌ ప్రపంచకప్‌ జట్టు నుండి నిష్క్రమించాడు. రిచర్డ్‌సన్‌ భుజ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు అని మంగళావారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. జై రిచర్డ్‌సన్‌ స్థానంలో కేన్ రిచర్డ్‌సన్‌ జట్టులోకి రానున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

షార్జా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండవ వన్డేలో జై రిచర్డ్‌సన్‌కు గాయం అయింది. ఆ సమయంలో చికిత్స కూడా తీసుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఆసీస్ ప్రపంచకప్‌ జట్టులో జై రిచర్డ్‌సన్‌ చోటు సంపాదించాడు. చికిత్స జరిగినా కూడా ఇంతవరకు రిచర్డ్‌సన్‌ కోలుకోలేదు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని ప్రపంచకప్‌ జట్టు నుండి తప్పించింది. అతని స్థానంలో కేన్ రిచర్డ్‌సన్‌కు అవకాశం ఇచ్చింది.

ఐపీఎల్‌కి ముందు భారత గడ్డపై టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో జై రిచర్డ్‌సన్‌ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌లలో 7 వికెట్లు తీసి పరుగులను కూడా నియత్రించాడు. 'ఇది ఆస్ట్రేలియా, రిచర్డ్‌సన్‌కు చేదు వార్తే' అని ఆస్ట్రేలియా ఫిజియోథెరపిస్ట్ డేవిడ్ బేక్లే అన్నారు.

ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌ స్మిత్‌, షాన్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అలెక్స్‌ కారె (వికెట్‌ కీపర్‌), ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ కౌల్టర్‌ నీల్‌, కేన్ రిచర్డ్సన్‌, జాసన్‌ బెహండ్రాఫ్‌, ఆడమ్‌ జంపా.

Story first published: Thursday, May 9, 2019, 14:15 [IST]
Other articles published on May 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+