Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆర్సీబీ అతన్ని తీసుకోవాలనుకుంటే దండగే- మాజీ క్రికెటర్

ఐపీఎల్ మెగా వేలం హీట్ మొదలైంది. మరికొన్ని నెలల్లో జరగనున్నఈ మెగా ఆక్షన్ గురించి నిబంధనలు ఇంకా ఖరారు కాకముందే చర్చలు పెద్దఎత్తున సాగడం గమనార్హం. ఏ జట్టు ఏ ఆటగాడిని ఉంచుకుంటే ఉత్తమం, ఎవరిని వదులుకుంటే మంచిది? అని క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోదని పేర్కొన్నాడు. అలాగే విధ్వంసకర మాక్స్‌వెల్‌కు మంగళం పలుకుతుందని అన్నాడు. అతన్ని తీసుకోవడం దండగ అని తెలిపాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, రజత్ పటిదార్‌ను రిటైన్డ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Should RCB Retain Faf du Plessis for 3 More Years Aakash Chopra Weighs in on IPL 2025 Retentions

డుప్లెసిస్‌కు 40 ఏళ్లు కావడంతో వదులుకోవడానికి ఫ్రాంచైజీ మొగ్గచూపుతుందని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఓ ఆటగాడిని మూడేళ్లు పాటు కొనసాగించాలనే ఉద్దేశంతో మెగా వేలంలో ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంటాయని, కానీ డుప్లెసిస్ వయసు రీత్యా అది సాధ్యపడదని తెలిపాడు. భారత బౌలర్‌ కావడంతో సిరాజ్‌కు రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చోప్రా చెప్పాడు. మాక్సీకి బదులుగా యువ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను తీసుకోవడం బెటర్ అని అన్నాడు.

అయితే రిటైన్డ్‌కు సంబంధించిన నిబంధనలు బీసీసీఐ ప్రకటించిన తర్వాత ఈ విషయాలపై పూర్తి స్పష్టత వస్తుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్‌లో 17 సీజన్లు ముగిశాయి. ప్రతి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. కానీ కప్ కల కలగానే మిగిలిపోతుంది. వరల్డ్ స్టార్ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు జట్టును బలోపేతం చేయాలని, దాని కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ గట్టిగా భావిస్తోంది.

Story first published: Thursday, September 12, 2024, 20:31 [IST]
Other articles published on Sep 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+