Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కొట్టే తొలి సిక్సర్ ఆయన పేరు మీదే: ట్విట్టర్‌లో ఓ నెటిజన్

Shoojit Sircar has a savage reply to BJP MLA who called Virat 'unpatriotic' for marrying Anushka in Italy

హైదరాబాద్: డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో టీమిండియా విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కోహ్లీకి దేశభక్తి లేదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఆ ఎమ్మెల్యేకి కౌంటర్‌ ఇస్తున్నారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు దేశభక్తి లేదని అందుకే ఇండియాలో కాకుండా ఇటలీలో వివాహం చేసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ (పింక్‌ సినిమా) తన ట్విట్టర్‌లో స్పందించారు.

'దేశభక్తి లేని విరాట్‌ కోహ్లీ తన తొలి సిక్సర్‌ను దేశభక్తి ఉన్న ఎమ్మెల్యే పేరు మీదే కొడతాడు' అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బాలీవుడ్ కమెడియన్‌ వీర్‌దాస్‌ సైతం పన్నాలాల్ వ్యాఖ్యలపై స్పందించాడు. పన్నాలాల్‌ను పర్యవసనాలు ఆలోచించని ఎమ్మెల్యే అంటూ సంబోధించాడు. తన ట్విట్టర్‌లో 'ఇక నుంచి కొత్త రూలు. ఏ ఎమ్మెల్యే అయినా సరే ఆలోచించకుండా, పిచ్చిగా మాట్లాడితే న్యూస్‌ చానెల్స్‌ వాటిని ప్రచారం చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు' అని ట్వీట్ చేశాడు.

Story first published: Friday, December 22, 2017, 17:42 [IST]
Other articles published on Dec 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+