Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుజారా భార్య పుస్తకంలో సంచలనం!

భారత టెస్ట్ క్రికెట్ దిగ్గజం ఛతేశ్వర్ పుజారా తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించడానికి ముందే ఓ భారీ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నాడో తాజాగా వెల్లడైంది. ఈ క్లిష్ట సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్, కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ చేసిన పెద్ద సహాయం గురించి పుజారా భార్య పూజ తన పుస్తకం 'ది డైరీ ఆఫ్ ఎ క్రికెటర్స్ వైఫ్' లో రాశారు.

ఐపీఎల్ 2010 ముందు జరిగిన విషాదం
యువ ప్రతిభావంతుడిగా ఐపీఎల్ 2010 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి వచ్చిన పుజారాకు దురదృష్టం వెటకారమాడింది. కేవలం ప్రాక్టీస్ సెషన్‌లో ఒక క్యాచ్ పట్టుకునే సాధారణ ప్రయత్నంలో ఛతేశ్వర్ పుజారాకు ఆంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ACL) గాయం అయింది. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే పుజారా సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అప్పటికి అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించని పుజారాకు తీవ్ర మానసిక ఆందోళన కలిగించింది.

Shocking Revelation How Shah Rukh Khan Saved Cheteshwar Pujara Career Story from His Wife Book

మద్దతు అందించిన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్
పుజారా కెరీర్ ముప్పులో ఉందని తెలుసుకున్న కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ వెంటనే జోక్యం చేసుకున్నారు. "చింటు (పుజారా ముద్దుపేరు)కి గొప్ప భవిష్యత్తు ఉంది, అతనికి అత్యుత్తమ వైద్య చికిత్స అందాలి," అని షారుఖ్ స్వయంగా పుజారా తండ్రితో చెప్పారు. షారుఖ్ సొంత ఖర్చులతో పుజారాకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మెరుగైన సర్జరీని ఏర్పాటు చేశారు. కేకేఆర్ యాజమాన్యం పాస్‌పోర్ట్‌లు, వీసాలు, ప్రయాణ ఏర్పాట్లన్నీ చూసుకుంది.విదేశంలో చికిత్సకు వెళ్లేటప్పుడు పుజారా కుటుంబానికి ఎటువంటి ఆందోళన ఉండకూడదని షారుఖ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. "మీ నమ్మకమున్న డాక్టర్‌ను, కుటుంబ సభ్యులను కూడా అక్కడికి పంపిస్తాం. వారికి ఇక్కడే డబ్బు చెల్లిస్తాం, మీకు మీ సొంత మనుషులు చుట్టూ ఉండేలా చూస్తాం," అని కేకేఆర్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ మానవతా సహాయం పుజారా కుటుంబానికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది.

అంతర్జాతీయ వేదికపై పుజారా ప్రస్థానం
షారుఖ్ ఖాన్ అందించిన ఈ అండదండలతో ఛతేశ్వర్ పుజారా గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అదే సంవత్సరం చివర్లో భారత టెస్ట్ జట్టు తరఫున అరంగేట్రం చేసి దేశానికి ఎన్నో విజయాలను అందించాడు. 2010లో ఆస్ట్రేలియాపై బెంగళూరు వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పుజారా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో పుజారా రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 72 పరుగులు చేసి భారత్‌ను గెలుపు అంచున నిలిపాడు. ఈ ఇన్నింగ్స్ పుజారా టెస్ట్ కెరీర్‌కు పునాది వేసింది. ఆ తర్వాత అతను 103 టెస్టులు ఆడి 7195 పరుగులు చేశాడు.

Story first published: Sunday, November 9, 2025, 14:29 [IST]
Other articles published on Nov 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+