
వికెట్ కీపింగ్ కొత్తేం కాదు
అంబటి రాముడు గతంలో కూడా పలు మార్లు వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టాడు. దేశవాళీ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లోనూ వికెట్ కీపర్‌గా మెరిశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో రాయుడు చాలా మ్యాచ్‌లలో కీపింగ్ చేశాడు. ముఖ్యంగా టీంకు వికెట్ కీపర్ సమస్యలు ఉన్నప్పుడు రాయుడు ఆ బాధ్యతలను చేపట్టడానికి ఎప్పుడూ ముందుండేవాడు.
ఏదో నామ మాత్రంగా కాకుండా రెగ్యూలర్ వికెట్ కీపర్ మాదిరిగా తన కీపింగ్ నైపుణ్యంతో రాయుడు ఆకట్టుకున్నాడు. ఇలా బ్యాటర్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా ఈ తెలుగు కుర్రాడికి మంచి గుర్తింపు ఉంది. జట్టులో ఎప్పుడూ పార్ట్ టైమ్ వికెట్ కీపర్‌గా రాయుడు కనిపిస్తుంటాడు.

వేలంలోకి కీపర్‌గా ఎందుకు?
అయితే రాయుడు ఐపీఎల్ మెగా వేలంలో అనేక సార్లు పాల్గొన్నాడు. కానీ ఎప్పుడూ కూడా వికెట్ కీపర్‌గా వేలంలోకి దిగలేదు. బ్యాటర్‌గా మాత్రమే రిజిష్టర్ చేయించుకునేవాడు. దీంతో ఈ సారి వేలంలోకి వికెట్ కీపర్‌గా ఎందుకు వచ్చాడనే చర్చ మొదలైంది. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న రాయుడుకు వేలంలో కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కుర్రాళ్ల దూకుడే రాయుడుకు కఠిన పరిస్థితులు ఎదురు కావడానికి కారణమయ్యాయి. అందుకే ఎలాగో వికెట్ కీపింగ్ చేయగలడు కాబట్టి ఆ పేరుతో రిజిష్టర్ చేయించుకుంటే బ్యాటర్‌గానే కాకుండా కీపర్‌గా కూడా ఉపయోగపడతాడనే అదనపు ప్లస్ పాయింట్ కలిసొస్తుందని రాయుడు భావించినట్టు సమాచారం. అందుకే బ్యాటర్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా వేలంలో రాయుడు రిజిష్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

వేలంలోకి రాయుడు
గతేడాది చెన్నైసూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడుకు ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. గతేడాది రాయుడుకు సీఎస్కే యాజమాన్యం 2.20 కోట్ల రూపాయలను చెల్లించింది. గతేడాది 16 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 28 సగటుతో 257 పరుగులు చేశాడు. కానీ వయసు ఎక్కువ కావడంతో రాయుడును సీఎస్కే ఈ సారి వేలంలోకి వదిలేసింది. దీంతో ఈ సారి వేలంలో రాయుడును ఏ జట్టు కొనుగోలు చేస్తుందనే ఆసక్తి నెలకొంది.

రాయుడు రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 175 మ్యాచ్‌లు ఆడిన అంబటి రాయుడు 29 సగటుతో 3,916 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులు. ఈ క్రమంలో రాయుడు 324 ఫోర్లు, 149 సిక్స్‌లు బాదాడు.


Click it and Unblock the Notifications












