Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్ రైజర్స్ కు షాక్.. సొంత మైదానంలో తొలిసారి ఓటమి, అదీ 12 పరుగుల తేడాతో

హైదరాబాద్: ఇప్పటివరకూ సొంత మైదానంలో ఓటమి ఎరుగని సన్ రైజర్స్ హైదరాబాద్ కు మొట్టమొదటిసారి షాక్ తగిలింది. ఐపీఎల్-10లో భాగంగా శనివారం నగరంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రైజింగ్ పుణె తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

పుణె విసిరిన 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి ఓటమి పాలైంది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(40;34 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్), యువరాజ్ సింగ్ (47;43 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లు) రాణించిన జట్టును గెలిపించలేకపోయారు.

xunadkat

వీరిద్దరూ మినహా మిగతా ఆటగాళ్ల ఘోరంగా విఫలం కావడంతో సన్ రైజర్స్ కు ఓటమి తప్పలేదు. ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కు పరిమితం కావడంతో సన్ రైజర్స్ పరాజయం పాలైంది. రైజింగ్ పుణె ఆటగాళ్లలో ఉనాద్కత్ ఐదు వికెట్లతో సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఇది పుణెకు ఎనిమిదో విజయం కావడంతో 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరువైంది.

అంతకుముందు పుణె ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పుణె ఆదిలోనే రాహుల్ త్రిపాఠి(1)వికెట్ ను కోల్పోయింది. అనవసర పరుగు కోసం యత్నించిన త్రిపాఠి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.

ఆ తరుణంలో అజింక్యా రహానేకు స్టీవ్ స్మిత్ జతకలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అయితే జట్టు స్కోరు 39 పరుగుల వద్ద రహానే(22) రెండో వికెట్ గా అవుట్ కావడంతో పుణె గాడి తప్పినట్లు కనబడింది. అయితే స్మిత్-బెన్ స్టోక్స్ లు 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో పుణె తిరిగి తేరుకుంది.

కానీ స్టోక్స్(39), స్మిత్ (34)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. అయితే చివర్లో మహేంద్ర సింగ్ ధోని(31;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+