హైదరాబాద్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య మహాసంగ్రామానికి సర్వం సిద్ధమైంది. నవంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే యాషెస్ టెస్టు సిరిస్ కోసం 16 మంది జట్టు సభ్యులతో కూడిన జట్టుని ఇంగ్లాండ్ ప్రకటించింది. జట్టు ఎంపికలో ఇంగ్లాండ్ ఊహించని షాకిచ్చింది.
ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్టు సిరిస్‌లో ముగ్గురు కొత్త వారికి సెలక్టర్లు చోటు కల్పించారు. బుధవారం ప్రకటించిన జట్టులో కొత్తగా బెన్ ఫోక్స్, మాసన్ క్రానే, క్రెయిగ్ ఓవర్టన్‌లను తొలిసారిగా జట్టులోకి ఎంపిక చేశారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా నవంబర్ 23న జరగనుంది.

ఇదిలా ఉంటే ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు యాషెస్ సిరీస్‌లో చోటుదక్కింది. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించిన 16 మంది జట్టు సభ్యుల్లో స్టోక్స్‌కు అవకాశం లభించింది. స్టోక్స్ గత ఆదివారం తప్పతాగి ఓ వ్యక్తిని చితకబాది జైలుపాలైన విషయం తెలిసిందే.
కోచింగ్ క్యాంప్‌కు హాజరుకాలేదని స్టోక్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విండీస్‌తో నాలుగో వన్డేకు దూరం పెట్టింది. దీంతో తర్వాతి మ్యాచ్‌లకు స్టోక్స్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందిగ్ధం నెలకొంది. అయితే యాషెస్ సిరిస్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టోక్స్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చోటు కల్పించింది.
బ్యాట్స్‌మెన్:
Joe Root (captain) Caps: 60 Runs 5323 Ave: 53.76
Alastair Cook Caps: 147 Runs 11629 Ave: 46.33
Mark Stoneman Caps: 3 Runs 120 Ave: 30.00
Dawid Malan Caps: 5 Runs 189 Ave: 23.62
Gary Ballance Caps: 23 Runs 1498 Ave: 37.45
James Vince Caps: 7 Runs 212 Ave: 19.27
వికెట్ కీపర్స్:
Jonny Bairstow Caps: 45 Runs 2824 Catches/stumpings: 119/7
Ben Foakes (uncapped) First-class apps: 76 Runs 3882 Catches/stumpings: 135/13
ఆల్ రౌండర్లు:
Moeen Ali Caps: 44 Runs: 2288 Wickets: 128
Ben Stokes Caps: 39 Runs: 2429 Wickets: 95
Chris Woakes Caps: 18 Runs: 675 Wickets: 50
బౌలర్లు:
James Anderson Caps: 129 Wickets: 506 Ave: 27.39
Jake Ball Caps: 3 Wickets: 2 Ave: 114.00
Stuart Broad Caps: 109 Wickets: 388 Ave: 28.81
Mason Crane (uncapped) First-class apps: 26 Wickets: 70 Ave: 42.22
Craig Overton (uncapped) First-class apps: 59 Wickets: 186 Ave: 26.48