Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సానియా మీర్జాకు షాక్.. మూడో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. పాక్ ప్రముఖ నటి సనా జావేద్‌ను వివాహమాడాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దుల దాటిన ఈ ప్రేమ జంట విడిపోతున్నట్లుగా గత కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ మాలిక్ మరో వివాహం చేసుకోవడం గమనార్హం.

తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియా మీర్జాను షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నాడు. పరిచయమైన కొన్ని నెలల్లోనే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకోవడంపై గతంలో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఆ సమయంలో ఆ జంట వాటిని కొట్టిపారేసింది. కామన్ ఫ్రెండ్‌తో ఏర్పడిన వారి పరిచయం, స్నేహంగా తర్వాత పెళ్లిగా మారింది. కాగా, వారికి అయిదేళ్ల కుమారుడు ఉన్నాడు.

Shock for Sania Mirza. Shoaib Malik married Pakistan actor Sana Javed

అయితే వారి మధ్య మనస్పర్థలు వచినట్లు రెండేళ్ల క్రితమే వార్తలు మొదలయ్యాయి. విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలకు తర్వాత బ్రేక్ పడింది. కానీ తాజాగా సానియా మీర్జా చేసిన పోస్ట్‌తో మరోసారి విడిపోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.''పెళ్లి కష్టం.. విడాకులు కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దాన్ని ఎంచుకోండి. అలాగే లావుగా ఉండటం కష్టమే.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే. అప్పు ఉండటం కష్టం. ఆర్థిక నియమం పాటించడమూ కష్టమే. మీరు సరైన దాన్ని ఎంచుకోండి. ఇతరులతో ఎటువంటి సమాచారం లేకుండా ఉండటం కష్టమే. అప్పుడే జీవితం కఠినంగా మారుతుంది. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి'' అంటూ సానియా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

అంతేగాక సానియా తన భర్త ఫోటో లేకుండానే ఫొటోల్ని ఇటీవల షేర్ చేస్తోంది.మరోవైపు స‌నా జావేద్‌కు ఇది రెండో వివాహం. పాకిస్తాన్‌ కు చెందిన ఈ ప్ర‌ముఖ న‌టీ వయసు 28 ఏళ్లు. స‌నా అనేక టీవీ షోల్లో క‌నిపించింది. 'ఏ ముష్త్‌-ఎ-ఖాన్‌', 'డంక్' అనే షోలతో ఆమెకు గుర్తింపు లభించింది. అయితే 2020లో ఉమైర్ జ‌స్వాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. మరోవైపు సనాతో మాలిక్ డేటింగ్ ఉన్నట్లు గతంలో చాలా సార్లు కథనాలు వచ్చాయి.

Story first published: Saturday, January 20, 2024, 13:30 [IST]
Other articles published on Jan 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+