Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్కన్ చార్జర్స్‌కు షాక్: ముంబై ఇండియన్స్ జట్టులో సుమన్

Tirumalasetti Suman
హైదరాబాద్: దక్కన్ చార్జర్స్‌కు షాక్ తగిలింది. హైదరాబాద్‌కు చెందిన తిరుమలశెట్టి సుమన్ ముంబై ఇండియన్స్ తరఫున ఐపియల్ పోటీల్లో ఆడనున్నాడు. ఐపీఎల్‌ నాలుగో సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు గురువారం బీసీసీఐ పెద్దల సమక్షంలో ముంబయి ఇండియన్స్‌తో సుమన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్‌క్యాప్డ్‌ ఆటగాడిగా ఏడాదికి రూ.30 లక్షల ఒప్పందంపై సంతకం చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఇస్తామని సుమన్‌కు ఫ్రాంచైజీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఐపీఎల్‌-2, ఐపీఎల్‌-3తో ప్రాతినిధ్యం వహించిన డెక్కన్‌ ఛార్జర్స్‌కు సుమన్‌ గుడ్‌బై చెప్పాడు.

హైదరాబాద్‌ ఓపెనర్‌గా, ఐపీఎల్‌లో గిల్‌క్రిస్ట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన సుమన్‌ తమకు పనికొస్తాడని ముంబయి భావించడంతో అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబయి తరఫున ఆడనున్న రెండో హైదరాబాదీ సుమన్‌. తన కోసం ఆరు ఫ్రాంచైజీలు దరఖాస్తు చేసుకోవడం సంతోషం కలిగించిందని ముంబయి ఇండియన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఓ పత్రికా ప్రతినిధితో సుమన్‌ అన్నాడు. ''గురువారం బీసీసీఐ కార్యాలయానికి నన్ను పిలిచారు. 'ఆరు ఫ్రాంచైజీలు నిన్ను తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాయి.. ఏ జట్టుకు ఆడతావని' అడిగారు. ఇంకో ఆలోచన లేకుండా ముంబయి ఇండియన్స్‌ అని చెప్పా. సచిన్‌ను అభిమానిస్తూనే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నా. అతనితో కలిసి ఆడే అవకాశం రావడం అదృష్టం. నా కల నెరవేరినట్లే''నని సుమన్‌ వివరించాడు. డెక్కన్‌ ఛార్జర్స్‌ను వీడటం బాధగానే ఉందని సుమన్‌ తెలిపాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+