Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్తర్ వాదన కేవలం పబ్లిసిటీ కొసమే: అక్రమ్

Wasim Akram
ఎప్పుడూ వివాదాల్లో ఉండే పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ మరోసారి వివాదాల్లో నిలిచాడు. స్లోగా ఉండే ఫైసలాబాద్‌ లాంటి పిచ్‌లపై తన పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే సచిన్‌కు భయమని, సచిన్‌, ద్రవిడ్‌లు మ్యాచ్‌ విన్నర్లు కాదని అన్నాడు. 'కాంట్రావర్షియల్లీ యువర్స్‌' పేరుతో రాసిన తన ఆత్మకథలో అక్తర్‌ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసందే. మ్యాచ్‌లను అసలు ఏ విధంగా ముగించాలో కూడా ఆ ఇద్దరికీ తెలియదని ఆరోపించారు. వివియన్‌ రిచర్డ్స్‌, పాంటింగ్‌, లారా తదితరులు గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని, నిజమైన మ్యాచ్‌ విన్నర్లని అక్తర్‌ అన్నాడు. తొలిసారి తాను బౌలింగ్‌ చేసినప్పుడు సచిన్‌లో ఈ లక్షణాలు లోపించినట్లు తాను గుర్తించానన్నాడు.

అత్యధిక పరుగులు, రికార్డులు సాధించి ఉండొచ్చని, కానీ మ్యాచ్‌ను ముగించే సామర్థ్యం సచిన్‌కు లేదని అక్తర్‌ విశ్లేషించాడు! తనను మోసం చేశారంటూ బాలీవుడ్‌ నటుడు, కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫ్రాంచైజీ షారుక్‌ ఖాన్‌, ఐపిఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోడీపైనా అక్తర్‌ ఆరోపణలు చేశాడు. డబ్బుల విషయంలో తనకు అసంతృప్తి ఏర్పడిందని, అయితే వారు బలవంతంగా ఒప్పించారని ఆరోపించాడు. ఈ విషయాలతోపాటు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో రాజకీయాలపైనా అక్తర్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన వసీం అక్రమ్‌ తనదైన శైలిలో స్పందించాడు. ప్రపంచ ఫాస్టు బౌలర్స్‌లలో ఒకడైన షోయబ్‌ అక్తర్‌ తన ఆటో బయోగ్రఫీలో సచిన్‌ వంటి స్టార్‌ ఆటగాడిని కించపరచడం మంచి పద్ధతి కాదని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న సచిన్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నాడు. ఎటువంటి బౌలర్‌నైనా దీటుగా ఎదుర్కొనే సత్తా ఒక్క సచిన్‌కే ఉందని, దీనిలో రెండో అభిప్రాయానికి తావులేదన్నాడు. తాను ఆడిన తొలి సిరీస్‌లోనే పాక్‌ బౌలర్లను హడలెత్తించిన ఘనత సచిన్‌కు దక్కుతుందన్నాడు. 1989 పాక్‌ సిరీస్‌లో సచిన్‌ తనతోపాటు వకార్‌ యూనిస్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొని అర్ధ సెంచరీని సాధించిన విషయాన్ని అక్రమ్‌ గుర్తు చేశాడు. అక్తర్‌ పబ్లిసిటీ కోసమే తన బయోగ్రఫీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని అక్రమ్‌ అభిప్రాయ పడ్డాడు.

ఇదే విషయంలో మరో ఇండియన్ ఆటగాడు సచిన్ సహచరుడు, మాజీ క్రికెటర్‌ వినోద్‌కాంబ్లీ తీవ్రంగా స్పందించాడు. అక్తర్‌కుగానీ, మరే బౌలర్‌కుగానీ సచిన్‌ ఎప్పుడూ భయపడలేదని, తనదైన శైలిలో ఆడిన సచిన్‌ క్రికెట్‌లో ఎన్నో రికార్డు సాధించాడని కొనియాడడం జరిగింది. ఇదంతా తాను రాసిన 'కాంట్రావర్షియల్లీ యువర్స్‌' పుస్తకం పబ్లిసిటీ కొసమేనని అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+