For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నా మొగడు ఉంటే నచ్చినట్టు ఆడతా' - మాజీ కెప్టెన్‌పై స్టార్ క్రికెటర్ భార్య సెటైర్లు!

సానియా మీర్జాతో విడిపోయిన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె.. ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులో పడింది. దీంతో క్రికెట్ అభిమానులంతా.. ఆమె క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఆమె తీరును విమర్శిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?
రీసెంట్‌గా సనా జావెద్ 'జీతో పాకిస్థాన్' అనే ఓ లైవ్ టీవీ షోలో పాల్గొంది. అందులో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలో అతడు.. తాను మీడియం పేసర్స్‌ను ఎదుర్కోవడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తానని అన్నాడు. అప్పుడు సనా.. 'బొమ్మలా నిన్ను ఎవరో గట్టిగా గాయపరిచినట్టు ఉన్నారే' అంటూ సరదాగా సెటైర్ వేసింది. దీంతో వెంటనే అతడు.. 'నాకు ఎక్కడ, ఎలా ఆడాలో తెలుసు, అక్కడే నేను ఆడతాను' అని సమాధానం చెప్పాడు. వెంటనే దానికి కూడా సెటైరికల్ గా మళ్లీ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది సనా. 'నేను కూడా నా మొగడుతో ఉంటే నాకు నచ్చినట్టు ఆడతాను' అంటూ వ్యాఖ్యలు చేసింది. దీంతో సనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Shoaib Maliks Wife Sana Javed Criticized for controversy comments on Sarfaraz Ahmed
Photo Credit: instagram screeshot

క్షమాపణలు చెప్పాల్సిందే..
2017 ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్‌పై అసభ్యకరంగా, అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సనాపై విమర్శలు కురిపిస్తున్నారు క్రికెట్ అభిమానులు. సనా క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

కాగా, సనా - షోయబ్ మాలిక్.. దాదాపు మూడేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉండి గతేడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. తన రెండో భార్య అయిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి.. సనాను పెళ్లి చేసుకున్నాడు షోయబ్.

Story first published: Saturday, March 22, 2025, 16:58 [IST]
Other articles published on Mar 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+