

హైదరాబాద్: ఎందరో వీరుల త్యాగఫలం భారత స్వాతంత్ర్యం. పంద్రాగస్టును దేశ వ్యాప్తంగా ప్రతి పౌరుడు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దాయాదీ దేశపు క్రికెటర్‌ను పెళ్లాడి పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇంట కోడలుగా అడుగుపెట్టిన సానియా మీర్జాకు కూడా శుభాకాంక్షలు అందాయి. అదెవరి దగ్గర్నుంచో కాదు. తన భర్త షోయబ్ మాలిక్.. పాకిస్థాన్ క్రికెటర్ నుంచి. భారత స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు ఇండిపెండెన్స్ డే జరుపుకున్న పాకిస్థాన్ క్రికెటర్‌కు సతీమణి సానియా శుభాకాంక్షలతో ట్వీట్ చేసింది.
దానికి బదులిచ్చిన షోయబ్.. సానియా మీర్జాకూడా శుభాకాంక్షలు తెలిపాడు. ఆమెతో పాటు భారత వాసులకు కూడా శుభాకాంక్షలు అందజేశాడు. వీరి ట్వీట్లలో వైవిధ్యమమంటే ఇరు దేశాల పౌరులందరికీ ఇద్దరూ శుభాకాంక్షలు తెలిపారు. మొదటగా సానియా మీర్జా తన అధికారిక ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్‌లో 'హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు మై పాకిస్థానీ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్' పాకిస్థానీ అభిమానులకు స్నేహితులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అని పేర్కొంది.
దానికి స్పందించిన షోయబ్ మాలిక్ దానికి బదులుగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత వాసులందరికీ కూడా శుభాకాంక్షలు. అంటూనే తన సతీమణికి ప్రత్యేక శుభాకాంక్షలు అందించాడు. ఆగష్టు 14వ తేదీ సానియా మీర్జానుద్దేశించి ఓ నెటిజన్ ఓ వివాదస్పదమైన ట్వీట్ చేశాడు.
పాకిస్థాన్ వాసి అయిన సానియా బాబీ మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. దానికి స్పందించిన సానియా మీర్జా 'అలా కాదండి.. నాది నా దేశానిది స్వాతంత్ర్య దినోత్సవం రేపు అంటే ఆగష్టు 15. నా భర్త.. అతని దేశానిది ఈ రోజు ఆగష్టు 14. మీరేదో తడబడ్డారనుకుంటా!! అలా అయితే పాపం మీదెప్పుడో.. మీరు బాగా అయోమయానికి లోనైనట్లున్నారు' అని సరైన సమాధానం చెప్పింది.