Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫీల్డర్‌ను భయపెట్టాలనుకునే ప్రయత్నంలో షోయబే అవుటయ్యాడు!!

Shoaib Malik hits Henry Nicholls with a ferocious shot, then gets out in a bizarre manner

హైదరాబాద్: కివీస్ బౌలర్లు పాక్ జట్టును ఓడించేందుకు భారీ వ్యూహాలు పన్నారు. న్యూజిలాండ్‌తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో బౌలింగ్.. ఫీల్డింగ్‌లలో యుక్తి ఉపయోగించి కట్టడి చేసేందుకు శాయశక్తులా పోరాడారు. అయినా ఎట్టకేలకు పాక్ గెలిచి శబాష్ అనిపించుకుంది. ఈ క్రమంలో పాక్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్‌ను అవుట్ చేసేందుకు చక్కటి ప్రణాళిక వేసి సక్సెస్ అయింది.

వాస్తవానికి ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో.. బ్యాట్స్‌మెన్‌కి సమీపంలో (షార్ట్‌లెగ్) ఫీల్డింగ్‌‌ పెట్టడం ఓ సాహసం. బ్యాట్ ఎడ్జ్ తాకి వచ్చే బంతుల కోసం కివీస్ ఆ ఫీల్డర్‌ని ఉంచింది. కానీ.. ఆ ఫీల్డర్‌ని బెదరగొట్టాలనే ఉద్దేశంతో.. మాలిక్ అతని తలమీదుగా బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. అతని షోయబ్ దురదృష్టం కొద్దీ ఔట్‌గా వినదిరగాల్సి వచ్చింది.

షోయబ్ మాలిక్ ఫీల్డర్‌కి బంతి అందకుండా భారీ షాట్ ఆడినా.. అది నేరుగా ఫీల్డర్ భుజానికి తాకి గాల్లోకి లేవడంతో ఔట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 33వ ఓవర్ వేసిన న్యూజిలాండ్ పేసర్ ఫర్గూసన్ బౌలింగ్‌లో బంతిని మాలిక్ స్క్వేర్‌ లెగ్ దిశగా హిట్ చేశాడు. కానీ.. బంతి వేగంగా వెళ్లి షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ నికోలస్ భుజానికి తాకి గాల్లోకి లేచింది. దీంతో.. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇస్‌ సోధి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లోనే పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్.. బౌన్సర్ బంతికి గాయపడిన నేలకొరిగిపోయాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని పాకిస్థాన్ 40.3 ఓవర్లలో 212/4తో ఛేదించింది.

Story first published: Saturday, November 10, 2018, 15:51 [IST]
Other articles published on Nov 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+