Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే మూడో పెళ్లి చేసుకున్నా - షోయబ్ మాలిక్

సానియా మీర్జాతో విడాకుల అనంతరం మూడో పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారి స్పందించాడు. ఇటీవల పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ వివాహమాడిన విషయం తెలిసిందే. సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికీ షోయ‌బ్‌కు అది రెండో వివాహం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా సనా జావేద్‌ను వివాహమాడాడు.

మరోవైపు స‌నా జావేద్‌కు ఇది రెండో వివాహం. పాకిస్తాన్‌ కు చెందిన ఈ ప్ర‌ముఖ న‌టీ వయసు 28 ఏళ్లు. స‌నా అనేక టీవీ షోల్లో క‌నిపించింది. 2020లో సింగర్ ఉమైర్ జ‌స్వాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. అయితే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి వేడుకకు అతని కుటుంబ సభ్యులు హాజరవ్వలేదని పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా, సనా జావెద్‌ను పెళ్లి చేసుకోవడం మాలిక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, సానియా మీర్జాతో విడాకులు తీసుకోవడాన్ని వారు సహించలేదని వార్తలు వచ్చాయి.

Shoaib Malik has responded for the first time about his personal life after his third marriage

ఈ నేపథ్యంలో మూడో పెళ్లిపై షోయబ్ మాలిక్ పరోక్షంగా మాట్లాడాడు. ప్రజల గురించి కాకుండా, మనసుకు నచ్చినట్లుగా నడుచుకోవాలని అన్నాడు. ఓ ఆన్‌లైన్ పోడ్ కాస్ట్‌లో తనపై వస్తున్న విమర్శలపై బదులిచ్చాడు. ''మీ మనసు ఏది చెబితే అదే చేయాలి. ప్రజలు ఏమనుకుంటారో అని ఎప్పటికీ ఆలోచించకూడదు. జనాలు అర్థం చేసుకోవడానికి పదేళ్లు లేదా ఇరవై ఏళ్లు సమయం కూడా పడుతుంది. అప్పటివరకు ఏ పని చేయకుండా ఆగిపోలేం కదా'' అని షోయబ్ మాలిక్ అన్నాడు.

మరోవైపు తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను షోయబ్ మాలిక్ తీవ్రంగా ఖండించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ కాంట్రాక్ట్ రద్దు కాలేదని స్పష్టం చేశాడు. బంగ్లా లీగ్‌లో 'ఫార్చ్యూన్ బరిషల్' ఫ్రాంచైజీ తరపున మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాలిక్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఫార్చ్యూన్ బరిషల్ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. ఖుల్నా రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ ఉద్దేశపూర్వకంగానే ఒకే ఓవర్‌లో మూడు నోబాల్స్ వేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కథనాలు వచ్చాయి.

Story first published: Tuesday, January 30, 2024, 10:57 [IST]
Other articles published on Jan 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+