Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైద‌రాబాద్ అల్లుడు షోయ‌బ్ మాలిక్‌కు వ‌సీం అక్ర‌మ్ చుర‌క‌లు: ఫేర్‌వెల్ డిన్న‌ర్ ఇవ్వొచ్చు గానీ..!

Shoaib Malik deserves a farewell dinner and not match, says Wasim Akram

క‌రాచి: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో దారుణంగా విఫ‌ల‌మైన‌ పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్‌పై చెల‌రేగిన విమ‌ర్శ‌ల దుమారం ఇంకా త‌గ్గ‌ట్లేదు. ప్ర‌పంచ‌క‌ప్‌లో షోయబ్ మాలిక్ ఆడిన మూడు మ్యాచ్‌ల‌ల్లో క‌లిపి ఎనిమిది ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇందులో రెండు డ‌కౌట్లు కూడా ఉన్నాయి. ఈ మెగా ఈ వెంట్ త‌రువాత షోయ‌బ్ మాలిక్ వ‌న్డే మ్యాచ్‌ల నుంచి వైదొల‌బోతున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత తాను వ‌న్డే క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాన‌ని షోయ‌బ్‌.. ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో- కింద‌టి నెల 16వ తేదీన మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో టీమిండియాతో ఆడిన మ్యాచ్ అత‌నికి చివ‌రిదైంది.

షోయ‌బ్ స్థానాన్ని భ‌ర్తీ చేసిన సొహైల్‌..

షోయ‌బ్ స్థానాన్ని భ‌ర్తీ చేసిన సొహైల్‌..

షోయ‌బ్ స్థానంలో హారిస్ సొహైల్‌కు తుది జ‌ట్టులో చోటు క‌ల్పించింది పాక్ టీమ్ మేనేజ్‌మెంట్‌. అత‌ను అద్భుతంగా రాణిస్తుండ‌టంతో ఇక షోయ‌బ్ అవ‌స‌రం జ‌ట్టుకు లేకుండా పోయింది. రిటైర్ అవుతున్న నేప‌థ్యంలో- షోయ‌బ్ మాలిక్‌ను బంగ్లాదేశ్‌తో జ‌రిగే చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ఆడిస్తార‌ని అంద‌రూ ఆశించారు. అలా జ‌ర‌గ‌లేదు. జ‌ట్టులో షోయ‌బ్ ఉన్నాడ‌నే విష‌యాన్నే విస్మరించిన‌ట్టుంది పాక్ టీమ్ మేనేజ్‌మెంట్‌. అత‌ణ్ని య‌థావిధిగా ప‌క్క‌న పెట్టింది. ఎలాంటి మార్పులు లేకుండానే బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డుతోంది. ఫేర్‌వెల్ మ్యాచ్ కోస‌మైనా షోయ‌బ్‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ లెజెండ‌రీ బౌల‌ర్ వ‌సీం అక్ర‌మ్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. షోయ‌బ్ మాలిక్‌కు చుర‌క‌లు అంటించేలా మాట్లాడారు.

ఫేర్‌వెల్ డిన్న‌ర్ ఇవ్వొచ్చు గానీ..

ఫేర్‌వెల్ డిన్న‌ర్ ఇవ్వొచ్చు గానీ..

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ త‌రువాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్ప‌బోతున్న షోయ‌బ్ మాలిక్‌కు ఫేర్‌వెల్ డిన్న‌ర్ ఇవ్వొచ్చు గానీ.. ఫేర్‌వెల్ మ్యాచ్‌ను మాత్రం ఆడించకూడ‌ద‌ని వ‌సీం అక్ర‌మ్ అన్నారు. ఏ క్రికెట‌ర్‌కైనా త‌న కేరీర్‌లో ఆడ‌బోయే చిట్ట‌చివ‌రి మ్యాచ్ గానీ, సిరీస్ గానీ, టోర్న‌మెంట్ గానీ అత్యుత్త‌మంగా భావిస్తార‌ని, దుర‌దృష్ట‌వ‌శావ‌త్తూ షోయ‌బ్ మాలిక్ దీనికి నోచుకోలేద‌ని చెప్పారు. పాకిస్తాన్ జ‌ట్టుకు షోయ‌బ్ మాలిక్ ప‌లు విజ‌యాలు అందించార‌ని, దాన్ని ఎవ‌రూ విస్మ‌రించ‌బోర‌ని అన్నారు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో షోయ‌బ్ మూడు మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడార‌ని, అందులోనూ అత‌ను ప్ర‌ద‌ర్శ‌న ఆశించిన స్థాయిలో లేద‌ని చెప్పారు. పాకిస్తాన్ క్రికెట్‌కు షోయ‌బ్ మాలిక్ చాలా సేవ చేశార‌ని, కొన్ని చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాల‌ను అందించార‌ని, దీనికి గుర్తుగా ఓ మంచి ఫేర్‌వెల్ డిన్న‌ర్ ఇవ్వొచ్చ‌ని వ్యాఖ్యానించారు.

మూడు మ్యాచుల్లో ఎనిమిది ప‌రుగులే..

మూడు మ్యాచుల్లో ఎనిమిది ప‌రుగులే..

ఏ క్రికెట‌ర్‌కు అయినా, ఏ జ‌ట్టుకు అయినా ప్ర‌పంచ‌క‌ప్ ఎలాంటి జ్ఞాప‌కాల‌ను మిగిల్చిందో, లేదో తెలియ‌దు గానీ.. షోయ‌బ్ మాలిక్‌కు మాత్రం ఈ టోర్న‌మెంట్ ఓ పీడ‌క‌ల‌గానే మిగిలింది. ఈ మెగా టోర్నీ త‌రువాత వ‌న్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న ఈ హైద‌రాబాద్ అల్లుడు.. అత్యంత దారుణంగా విఫ‌లం అయ్యాడు. మూడు మ్యాచుల్లో ఎనిమిది ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఆస్ట్రేలియా, భార‌త్‌ల‌పై అత‌ను డ‌కౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రెండో బంతికి, టీమిండియాతో మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. అంత‌కుముందు మ్యాచ్‌లో ఎనిమిది ప‌రుగులే చేశారు. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న టీమిండియాతో మ్యాచ్‌లో విఫ‌లం కావ‌డంతో అత‌ణ్ని ప‌క్క‌న పెట్టింది పాక్ టీమ్ మేనేజ్‌మెంట్‌. హారిస్ సొహైల్‌ను తీసుకుంది.

Story first published: Friday, July 5, 2019, 17:56 [IST]
Other articles published on Jul 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+