Shoaib Akhtar: కేన్ మామ ఐపీఎల్లో గిట్ల ఆడితే ఎట్లా? కాస్త బ్యాట్ దులుపు కదా!

న్యూజిలాండ్, మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు కన్సిస్టెన్సీ ప్లేయర్‌గా పేరుంది. ఐపీఎల్ 2022లో మాత్రం అతను పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని ప్రదర్శన నాసిరకంగా ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కేన్ మామ చాలా కనీసం 100స్ట్రైక్ రేట్‌తో కూడా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో 10 ఇన్నింగ్స్‌లలో కేన్ 199 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అయితే అతని స్ట్రైక్‌రేటు మాత్రం 96.13గా ఉంది. ఇది వన్డే, టెస్ట్‌లకు సూటయ్యే స్ట్రైక్ రేటు. అలాంటిది టీ20లో అది కూడా ఐపీఎల్ లాంటి టఫ్ కంపిటేషన్ ఉండే టోర్నీల్లో ఈ రకమైన స్ట్రైక్ రేటు కలిగి ఉండడం నిజంగా చెత్త ప్రదర్శనే అని చెప్పాలి. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కేన్ మామ ఆటతీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

విలియంగా కాదు విలన్‌గా మారాలి
'సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇకనైనా బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించాలి. బ్యాటింగ్ ఆర్డర్‌లో కేన్ తన స్థానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఓపెనర్‌గానే దిగి తన బ్యాటింగ్ పవర్ చూపించాలి. కేన్ విలియం అనే పేరు మర్చిపోయి విలన్‌గా మారి బ్యాట్‌తో దండెత్తాలి. అతను దూకుడుగా స్కోర్ చేయాలి.. లేకపోతే జట్టు ఇబ్బందుల్లో పడుతుంది. టీ20 ఫార్మాట్లో ఓపెనర్లకు స్కోర్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది.' అని అక్తర్ విలియమ్సన్ కు సూచనలు చేశాడు.

మైనస్‌లో విలియమ్సన్ మ్యాచ్ ఇంపాక్ట్
ఈ ఐపీఎల్ సీజన్లో కేన్ విలియమ్సన్ మ్యాచ్ ఇంపాక్ట్ విలువ మైనస్‌లో ఉంది. ఈ టోర్నీలో ఏ ప్లేయర్‌కు లేనంత తక్కువగా విలియమ్సన్ ఇంపాక్ట్ విలువ ఉండడం సన్ రైజర్స్‌ను కలవరపరుస్తుంది. అతని ఇంపాక్ట్ విలువ -85గా ఉంది. అంటే అసలు మ్యాచ్ విషయంలో అతను ఎలాంటి తన మార్క్ చూపించలేకపోతున్నాడన్న మాట. ఇది ఓ కెప్టెన్‌గా విలియమ్సన్ ఎదుర్కొంటున్న చెత్త విషయమనే చెప్పాలి.

పూరన్ మంచి షాట్లు ఆడగలడు
ఇక అక్తర్ సన్ రైజర్స్ మరో ప్లేయర్ నికోలస్ పూరన్ గురించి మాట్లాడుతూ.. పూరన్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. అతను చాలా మంచి షాట్లను ఆడగలడు. అతను త్వరగా స్కోర్ చేయడమే కాకుండా ఆటపై మంచి అవగాహన కూడా కలిగి ఉంటాడని పేర్కొన్నాడు. అలాగే నటరాజన్ గురించి మాట్లాడుతూ.. నటరాజన్ మంచి ప్రతిభావంతుడని, అతను జట్టుకు ఒక ఆస్తి కాగలడని, రాబోయే రోజుల్లో అతని నుంచి మరింత మంచి ప్రదర్శన చూడాలనుకుంటున్నా అని పేర్కొన్నాడు. ఇక భువనేశ్వర్ గురించి మాట్లాడుతూ.. భువీ చాలా తెలివైన బౌలర్ అని పేర్కొన్నాడు.
ఇక సన్ రైజర్స్ నేడు ఆర్సీబీతో తలపడుతుంది. ఇక ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో సన్ రైజర్స్ కొనసాగుతుంది. ప్లే ఆఫ్ రేసులో ముందుకెళ్లాలంటే నేడు ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో కేన్ సేన తప్పకుండా గెలవాల్సిన అవసరముంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications