
షారుఖ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ
షారుఖ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ... 'అప్పుడు నేను 200 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నా. ఆ సమయంలో అక్తర్ చాలా అలసిపోయాడు. దీంతో రౌండ్ ది వికెట్‌గా బంతులేస్తూ.. నా వైపు బౌన్సర్లు సంధించాడు. పదేపదే అలా చేస్తే.. నేను హుక్ షాట్ ఆడతా అని అక్తర్ ప్లాన్. అయితే అక్తర్ మళ్లీ అలాంటి బంతులే వేస్తాడని భావించి.. నేను అతని వద్దకెళ్లి ఆ బౌన్సర్లను నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సచిన్‌కు వేయమని చెప్పా. తర్వాతి ఓవర్‌లో సచిన్‌కు బౌన్స్ వేయగా.. ఆ బంతి సిక్స్ వెళ్ళింది' అని అన్నాడు.

సెహ్వాగ్‌పై ఎప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదు:
అయితే ఇలాంటి సంఘటనేదీ తమ మధ్య చోటుచేసుకోలేదని షోయబ్ అక్తర్ తాజాగా వెల్లడించాడు. కావాలంటే.. ఈ విషయంపై మాజీ గౌతమ్ గంభీర్‌ను కూడా అడగండి అని పేర్కొన్నాడు. 'నా గురించి ఎవరైనా ఇలా చెబితే వాళ్లని వదిలిపెడతాననుకున్నారా?. నిజం చెప్పాలంటే సెహ్వాగ్, నేను 2011 ప్రపంచకప్ సందర్భంగా కలుసుకున్నాం. అప్పుడు మా పక్కనే గంభీర్ కూడా ఉన్నాడు. కావాలంటే అతన్ని కూడా అడగండి. అప్పుడు స్లెడ్జింగ్‌పై సెహ్వాగ్‌ని నిలదీశా. నువ్వు టీవీలో షారుఖ్‌తో నా గురించి ఇలా చెప్పావా అని అడిగాను. అతను లేదన్నాడు' అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ చెప్పాడు.

సందర్భాల్లో చాలా కఠినంగా ఉంటా
సెహ్వాగ్ నిన్ను అలా అనలేదు అనగానే అతనితో ఈ మాట చెప్పా. 'ఒకవేళ నిజంగా నువ్విలా అన్నావని తెలిస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టను. నీకు తెలుసా?.. కొన్ని సందర్భాల్లో నేను చాలా కఠినంగా ఉంటా' అని అక్తర్ పేర్కొన్నాడు. అక్తర్ తన పేస్ బౌలింగ్‌తో ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌లను కూడా వణికించాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు.

నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారు
ఇటీవల సెహ్వాగ్, గంభీర్ మంచివారంటూనే వారిపై విమర్శలు గుప్పించాడు అక్తర్. 'సెహ్వాగ్, గంభీర్ చాలా మంచి వ్యక్తులు. మానవత్వం కలిగిన ఆటగాళ్లు. కానీ టీవీ షోలో మాత్రం తమ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారు. నేను కూడా వారిలా మాట్లాడగలను. చెడు మాటలు చెప్పగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే.. చిన్న పిల్లలు టీవీ షోలు చూస్తారు' అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












