హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌పై పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2008 సీజన్ లో షారుక్ ఖాన్ సహా యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున షోయబ్ ఆడాడు.
అప్పుడు షారుక్ ఖాన్‌ని ఎత్తుకుని ఉన్న ఫోటోని గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'సూపర్ స్టార్ గొప్ప జ్ఞాపకం. స్నేహితుడు. అతను చాలా మంచి వ్యక్తి. ఎంతో మర్యాదస్తుడు' అని ఫోటో కింద కామెంట్ పోస్టు చేశాడు.

2008 ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 110 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన అక్తర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం షోయబ్ అక్తర్.. షారుక్‌ని ఎత్తుకుని మైదానంలో హల్ చల్ చేశాడు. ఈ ఫోటోని గురువారం షోయబ్ అక్తర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.