Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారతీయులు చాలా మంచివాళ్లు.. యుద్ధాన్ని అసలే కోరుకోరు: అక్తర్‌

Shoaib Akhtar says India dying to work with Pakistan, dont want war

కరాచీ: నేను దాదాపు ఇండియా మొత్తం తిరిగాను, భారతీయులు చాలా మంచివాళ్లు అని పాకిస్థాన్‌ మజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. భారత్‌ యుద్ధాన్ని కోరుకోదని, పాకిస్థాన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంటుందన్నాడు. మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 రద్దయితే.. భారత్‌ భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని అక్తర్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ చాట్‌షోలో పాల్గొన్న అక్తర్‌ పలు విషయాలు పంచుకున్నాడు.

భారత్‌ యుద్ధాన్ని కోరుకోదు:

భారత్‌ యుద్ధాన్ని కోరుకోదు:

'నేను దాదాపు భారత్ మొత్తం తిరిగాను. ఇండియా ఒక అద్భుతమైన దేశం. మ్యాచ్‌లు ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలను చాలా దగ్గరి నుంచి చూశాను. భారతీయులు చాలా మంచివాళ్లు. ఎల్లప్పుడూ పాకిస్థాన్‌ను స్వాగతిస్తూనే ఉంటారు. పాక్‌తో కలిసి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. యుద్ధాన్ని అసలే కోరుకోరు. కానీ.. టీవీల్లో చూసినప్పుడు మాత్రం రెండు దేశాల మధ్య రేపే యుద్ధం జరుగుతుందన్నట్లు అనిపిస్తుంది. భారత్ పురోగతి పాకిస్థాన్‌తో ముడిపడి ఉందని నా నమ్మకం' అని అక్తర్‌ అన్నాడు.

వైరస్ వ్యాపించడం దురదృష్టకరం:

వైరస్ వ్యాపించడం దురదృష్టకరం:

'ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించడం దురదృష్టకరం. కరోనా ప్రభావంతో పీఎస్ఎల్‌ (పాకిస్థాన్‌ ప్రిమియర్‌ లీగ్‌) కుదించాల్సి వచ్చింది.ఇక ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఆటగాళ్లకు ఇదో కొత్త అనుభవం. పీఎస్‌ఎల్ వల్ల పాకిస్థాన్‌కు క్రికెట్‌ తిరిగి వచ్చింది. వైరస్ కారణంగా ఐపీఎల్‌ అయితే ఏకంగా రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది' అని అన్నాడు. కరోనా విషయంలో చైనా దేశస్థుల ఆహారపు అలవాట్లపై అక్తర్‌ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

చైనాపై అక్తర్‌ ఫైర్:

చైనాపై అక్తర్‌ ఫైర్:

వైరస్‌ వ్యాప్తికి కారణమైన చైనాపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డారు. ఏది పడితే అది తిని ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్తర్‌ తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ... 'అసలు మీరు (చైనీయులు) గబ్బిలాలు, పాములు, కప్పలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు ఎందుకు తింటున్నారో నాకు అర్థం కావడం లేదు. వాటి రక్తం, మూత్రంతో మీరు వైరస్‌ను పుట్టించి ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు' అని ఘాటు వ్యాఖ్యలు చేసారు.

 చైనీయులకు వ్యతిరేకం కాదు:

చైనీయులకు వ్యతిరేకం కాదు:

'నేను ఇక్కడ కేవలం చైనీయుల గురించే మాట్లాడుతున్నా. గబ్బిలాలు, కప్పలు, పాములు, కుక్కలు వంటికి తినడం తమ సంస్కృతిలో భాగం అని చైనీయులు అనొచ్చు. కానీ.. ఆ సంస్కృతి మీకు లాభాన్ని కాకుండా తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది కదా. చైనాని నిషేధించాలని నేను చెప్పట్లేదు. ఏది పడితే అది తినడం సరికాదని అంటున్నా. నేను చైనీయులకు వ్యతిరేకం కాదు. అక్కడ మూగజీవాలపై ఉన్న చట్టాలనే ప్రశ్నిస్తున్నా' అని అక్తర్‌ పేరొన్నారు.

Story first published: Tuesday, March 17, 2020, 8:53 [IST]
Other articles published on Mar 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+