ఇమ్రాన్‌కు ఉన్న టాలెంట్ సెహ్వాగ్‌కి లేదు.. కానీ బుర్ర మాత్రం ఉంది: అక్తర్

కరాచీ: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఎప్పుడు ఏది మాట్లాడుతాడో అతనికే అర్ధం కాదు. భారత క్రికెటర్లను ఒక్కోసారి ఆకాశానికి ఎత్తేస్తే.. మరోసారి నెలకు దించేస్థాడు. ఒక్క భారత ఆటగాళ్లనే కాదు ఏ క్రికెటర్ విషయంలోనైనా ఇంతే. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న అక్తర్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కంటే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ ఎక్కువ టాలెంటెడ్ అని పేర్కొన్నాడు. అయితే సెహ్వాగ్‌కి ఉండే బుర్ర నజీర్‌కి లేదుని అక్తర్ అన్నాడు.

నజీర్‌కు బుర్ర లేదు:
తాజాగా ఓ టీవీ షోలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'వీరేంద్ర సెహ్వాగ్‌కు ఉన్న బుర్ర ఇమ్రాన్ నజీర్‌కు ఉందని నేను అనుకోను. ఇమ్రాన్‌కు ఉన్న టాలెంట్ సెహ్వాగ్‌కి లేదుని నా అభిప్రాయం. ఇక్కడ ప్రతిభ, పోలికకు సంబంధం లేదు. భారత్‌పై విధ్వంసక సెంచరీ బాదిన తర్వాత నిలకడగా ఆడాలని నజీర్‌కి నేను సూచించాను. కానీ.. అతను నా మాటలు పట్టించుకోలేదు. దురదృష్టవశాత్తు అతడి సేవల్ని జట్టు ఎక్కువకాలం వినియోగించుకోలేకపోయింది. సెహ్వాగ్ కంటే ఇమ్రాన్ బెటర్ ప్లేయర్.. మంచి ఫీల్డర్' అని పేర్కొన్నాడు.

నజీర్ బాగా ఆడటానికి కారణం మియాండాద్:
ఇమ్రాన్ నజీర్ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోవడంపై అప్పట్లో పాకిస్తాన్ జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే పాకిస్తాన్ తరఫున నజీర్ బాగా ఆడటానికి జావేద్ మియాండాద్ కీలక పాత్ర పోషించాడని అక్తర్ వెల్లడించాడు. 'జావేద్ మియాండాద్ వలెనే ఇమ్రాన్ బాగా ఆడాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి సూచనలు ఇచ్చేవాడు. చెత్త షాట్ ఆడినప్పుడల్లా జావేద్ భాయ్ అతనికి సందేశం పంపేవాడు' అని అక్తర్ చెప్పాడు. పాక్ తరఫున అక్తర్ 46 టెస్ట్ మ్యాచ్‌లు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు.

భారత్‌పై విధ్వంసక సెంచరీ:
1999లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన నజీర్.. భారత్‌పై మ్యాచ్‌లో విధ్వంసక సెంచరీ చేసాడు. దీంతో పాక్ తరఫున నజీర్ తిరుగులేని క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు అంచనాలు వేశారు. కానీ నెలల వ్యవధిలోనే అతని కెరీర్ గాడి తప్పింది. 8 టెస్టులు, 79 వన్డేలు, 25 టీ20 ఆడిన నజీర్.. 2,822 పరుగులు మాత్రమే చేశాడు. కానీ సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 17,253 పరుగులు చేసిన విషయం తెలిసిందే. సెహ్వాగ్, అక్తర్ మధ్య సుదీర్ఘకాలంగా ఆధిపత్య పోరు జరుగుతోంది. క్రికెట్ ఆడే రోజుల్లో మైదానంలో పోటీపడిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు వీడ్కోలు పలికినా తరచూ మాటల యుద్ధానికి దిగుతున్నారు.

పాకిస్థాన్‌ను ఎప్పుడూ మోసం చేయలేదు:
తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఏ బుకీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనని సంప్రదించలేదని షోయబ్ అక్తర్ తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో అక్తర్ మాట్లాడుతూ... 'పాకిస్థాన్‌ను ఎప్పుడూ మోసం చేయలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేననే నమ్మకం నాపై నాకుంది. నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేయకున్నా.. కొంతకాలం మ్యాచ్ ఫిక్సర్ల మధ్య ఉన్నా. మైదానంలో 22 మంది ఉంటారు. ఎవరికి తెలుసు.. ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారో' అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications