Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ను ఎన్నోసార్లు ఔట్ చేశా.. కానీ 2003 ప్రపంచకప్‌లోని సిక్సే భారతీయులకు గుర్తుంటుంది: అక్తర్‌

Shoaib Akhtar says Ive dismissed Sachin many times but Indians only remember one six in 2003 WC

లాహోర్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను ఎన్నోసార్లు ఔట్ చేశాను కానీ.. 2003 ప్రపంచకప్‌లో లిటిల్‌ మాస్టర్‌ నా బౌలింగ్‌లో కొట్టిన సిక్సే భారతీయులకు గుర్తుంటుంది అని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. సచిన్‌ను ఎన్నోసార్లు ఔట్ చేసినా భారతీయులు తన ప్రతిభను గుర్తించడంలేదని అసహనం వ్యక్తం చేసాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 2000ల ప్రారంభంలో సచిన్, అక్తర్‌ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకున్నారు. కొన్నిసార్లు సచిన్‌ పైచేయి సాధిస్తే మరికొన్ని సార్లు అక్తర్‌ విజృంభించాడు.

 సచిన్‌ క్లాస్ ఇన్నింగ్స్

సచిన్‌ క్లాస్ ఇన్నింగ్స్

షోయబ్‌ అక్తర్‌ గురువారం ఇన్‌స్టా‌ వీడియోలో మాట్లాడుతూ ఆల్‌టైమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో సచిన్‌ ఒకరని కొనియాడాడు. ఇక సచిన్‌తో తన అనుభవాలను నెమరువేసుకున్నాడు. 2003 ప్రపంచకప్‌ నాటి భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్‌ గురించి చెప్పాడు. ఆ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్‌ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సచిన్‌ (98; 75 బంతుల్లో 12x4, 1x6) క్లాస్ ఇన్నింగ్స్ కారణంగా భారత్‌ సునాయాస విజయం సాధించింది.

అక్తర్‌ బౌలింగ్‌లో సిక్స్‌

అక్తర్‌ బౌలింగ్‌లో సిక్స్‌

ఈ మ్యాచ్‌లో సచిన్‌, అక్తర్‌ మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. అందుకు కారణం సచిన్ ఆదిలోనే అక్తర్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టడం. అయితే సచిన్‌ 98 పరుగుల వద్ద అక్తర్‌ బౌలింగ్‌లోనే ఔట్ అయి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సచిన్ కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచింది. ఆరోజు సచిన్‌ కొట్టిన సిక్స్‌ ఇప్పటికీ భారత అభిమానుల గుండెల్లో అలాగే ఉండిపోయింది. బ్యాటింగ్ దిగ్గజం సచిన్‌ను ఔట్ చేసిన అక్తర్‌ను మరిచి భారతీయులు అందరూ ఆ సిక్సే గుర్తుంచుకున్నారు. ఈ నేపథ్యంలో నాటి అనుభవాల్ని గుర్తుచేసుకున్న అక్తర్‌ తన అసహనం వ్యక్తం చేసాడు.

ఆ ఒక్క సిక్సే భారతీయులు గుర్తుంచుకుంటారు

ఆ ఒక్క సిక్సే భారతీయులు గుర్తుంచుకుంటారు

'2003 ప్రపంచకప్‌ సందర్భంగా సెంచూరియన్‌లో జరిగిన వన్డేలో సచిన్‌ నా బౌలింగ్‌లో కొట్టిన ఆ ఒక్క సిక్సే భారతీయులు గుర్తుంచుకుంటారు. సచిన్‌ను ఎన్నోసార్లు ఔట్ చేశాను కానీ.. అది వాళ్ళు మరచిపోయారు. ఆ ఒక్క సిక్సే వాళ్లకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ ఒక్క సిక్సే.. 130 కోట్ల మందిని సంతోషపెడుతుందని తెలిస్తే రోజూ సచిన్‌తో సిక్స్‌ కొట్టించుకునేవాడిని' అని అక్తర్‌ చమత్కరించాడు.

సచిన్‌ను ఔట్‌ చేసింది 8 సార్లే

సచిన్‌ను ఔట్‌ చేసింది 8 సార్లే

సచిన్‌కు బౌలింగ్‌ చేయడానికి తనకు మంచి సమయం దొరికిందని, అతనో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని అక్తర్‌ పేర్కొన్నాడు. అలాగే తన కెరీర్‌లో సచిన్‌ను 12-13 సార్లు ఔట్‌ చేశానని అక్తర్‌ గొప్పగా చెప్పుకున్నాడు. నిజం చెప్పాలంటే మాత్రం.. అతడు సచిన్‌ను ఔట్‌ చేసింది 8 సార్లే. వన్డేల్లో 5 సార్లు కాగా.. టెస్టుల్లో 3 సార్లు. ఇక టీ20 క్రికెట్‌లో 2008 ఐపీఎల్‌ సీజన్‌లో ఒక్కసారి పెవిలియన్ చేర్చాడు. అక్తర్ తన కెరీర్‌లో 46 టెస్టులు ఆడాడు. 25.69 సగటుతో 178 వికెట్లు పడగొట్టాడు. ఇక పాకిస్తాన్ తరఫున 163 వన్డేలు ఆడి ఇందులో 24.97 సగటుతో 247 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, April 17, 2020, 16:05 [IST]
Other articles published on Apr 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+