'భారత్‌లోనూ ఎక్కువ మంది నన్ను ప్రేమిస్తున్నారు.. పీఎస్ఎల్ బ్రాండ్‌వాల్యూ పెంచుతా'

రావల్పిండి: పాకిస్థాన్‌తో పాటు భారత్‌లోనూ ఎక్కువ మంది నన్ను ప్రేమిస్తున్నారని రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) బ్రాండ్ వాల్యూను విశ్వవ్యాప్తం చేయగలనని అక్తర్ ధీమా వ్యక్తం చేసాడు. ఇక పీఎస్ఎల్లో ఓ జట్టును సొంతం చేసుకోవాలనే కోరికను అక్తర్ బయటపెట్టాడు. యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినప్పటి నుండి అక్తర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే.

పీఎస్ఎల్ బ్రాండ్వాల్యూను పెంచుతా
శుక్రవారం షోయబ్ అక్తర్ జియో న్యూస్‌తో మాట్లాడుతూ... 'పీఎస్ఎల్లో రెండు కొత్త జట్లను తీసుకురావాలని పీసీబీ చూస్తోంది. రెండు జట్లకు పీసీబీ బిడ్‌లను ఆహ్వానిస్తే.. నేను పాల్గొంటా. ఓ జట్టును సొంతం చేసుకోవాలనుంది. పాకిస్థాన్‌తో పాటు సరిహద్దుల అవతల (భారత్) కూడా ఎక్కువ మంది నన్ను ప్రేమిస్తున్నారు. ప్రజలకు నా గురించి బాగా తెలుసు. నాకు ఓ జట్టు ఉంటే పీఎస్ఎల్ బ్రాండ్వాల్యూను విశ్వవ్యాప్తం చేస్తా. ప్రపంచ నలుమూలల నుంచి పీఎస్ఎల్లోకి పెట్టుబడులు కూడా తేగలను' అని అన్నాడు.

షారూఖ్ ఖాన్‌ను రంగంలోకి దించారు
షోయబ్ అక్తర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఓ ఉదాహరణగా చూపించాడు. ఐపీఎల్ టోర్నమెంట్ విలువను పెంచడానికి బీసీసీఐ అధికారులు బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌ను రంగంలోకి దించారన్నారు. ఐపీఎల్‌తో సమానంగా పీఎస్ఎల్కు కూడా ప్రజాదరణ ఉందని అక్తర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దాయాది దేశాల మధ్య సంబంధాలు అంతగా లేకున్నా.. అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారత అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటున్నాడు.

భారతీయులు చాలా మంచివాళ్లు
'నేను దాదాపు భారత్ మొత్తం తిరిగాను. ఇండియా ఒక అద్భుతమైన దేశం. మ్యాచ్‌లు ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలను చాలా దగ్గరి నుంచి చూశాను. భారతీయులు చాలా మంచివాళ్లు. ఎల్లప్పుడూ పాకిస్థాన్‌ను స్వాగతిస్తూనే ఉంటారు. పాక్‌తో కలిసి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. యుద్ధాన్ని అసలే కోరుకోరు. కానీ.. టీవీల్లో చూసినప్పుడు మాత్రం రెండు దేశాల మధ్య రేపే యుద్ధం జరుగుతుందన్నట్లు అనిపిస్తుంది. భారత్ పురోగతి పాకిస్థాన్‌తో ముడిపడి ఉందని నా నమ్మకం' అని అక్తర్ ఇటీవలే అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications