Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలా అడిగిఉంటే వసీం అక్రమ్‌ని చంపేసేవాడిని: అక్తర్

Shoaib Akhtar says he would have killed Wasim Akram if he had asked him to fix matches

కరాచీ: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడే సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని అప్పటి కెప్టెన్ వసీం అక్రమ్ అడిగిఉంటే అతడిని చంపేసేవాడిని అని అక్తర్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ క్రికెట్‌ను ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఫిక్సింగ్ కారణంగా తమ కెరీర్‌లను నాశనం చేసుకున్నారు. అయినా కూడా పాక్ క్రికెటర్లలో మార్పు మాత్రం రావడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఫిక్సింగ్ కేసులు మాత్రం ఇంకా వెలుగుచూస్తూనే ఉన్నాయి.

పాకిస్థాన్​ను ఎప్పుడూ మోసం చేయలేదు

పాకిస్థాన్​ను ఎప్పుడూ మోసం చేయలేదు

తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఏ బుకీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనని సంప్రదించలేదని షోయబ్ అక్తర్ తెలిపాడు. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'పాకిస్థాన్​ను ఎప్పుడూ మోసం చేయలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేననే నమ్మకం నాపై నాకుంది. నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేయకున్నా.. కొంతకాలం మ్యాచ్ ఫిక్సర్ల మధ్య ఉన్నా. మైదానంలో 22 మంది ఉంటారు. ఎవరికి తెలుసు.. ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్​కు పాల్పడుతున్నారో' అని అక్తర్ చెప్పాడు.

అక్రమ్‌ని చంపేసేవాడిని

అక్రమ్‌ని చంపేసేవాడిని

'1990 నుంచి మ్యాచ్‌లు చూసేవాడ్ని. ఎన్నో మ్యాచ్‌ల్లో వసీం అక్రమ్ తన అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టుని గెలిపించడం నేను చూశాను. ఒకవేళ అక్రమ్​ నన్ను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని అడిగి ఉంటే.. అతడి కచ్చితంగా నాశనం చేసేవాడిని. చంపేందుకు కూడా వెనుకాడేవాడిని కాదు. అయితే అక్రమ్ నా వద్ద ఫిక్సింగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు' అని అక్తర్ వెల్లడించాడు.

అక్రమ్ బౌలింగ్​పై ప్రశంసలు:

అక్రమ్ బౌలింగ్​పై ప్రశంసలు:

వసీం అక్రమ్ బౌలింగ్​పై అక్తర్ ప్రశంసలు కురిపించాడు. 'అక్రమ్ జట్టులో ఉండగా.. ఏడు, ఎనిమిది సంవత్సరాలు ఆడాను. 1990ల్లో ఓడిపోయే మ్యాచ్​లను​​ అద్భుతమైన బౌలింగ్​తో గెలిపించడాన్ని చూసి ఆశ్చపోయేవాడిని. టాప్-ఆర్డర్ వికెట్లు తీసే బాధ్యతను అతడు తీసుకొని.. నాకు టెయిల్-ఎండర్ల వికెట్లు వదిలేసేవాడు' అని పేర్కొన్నాడు. పాక్ తరఫున అక్తర్ 46 టెస్ట్ మ్యాచ్‌లు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు.

ప్రపంచం గాడిలో పడాలంటే ఏడాది పడుతుంది:

ప్రపంచం గాడిలో పడాలంటే ఏడాది పడుతుంది:

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆరంభం కావడానికి సుదీర్ఘ సమయం పట్టడం ఖాయమని అక్తర్ మరోసారి జోస్యం చెప్పాడు. 'ప్రస్తుతం ప్రపంచం లాక్‌డౌన్‌లోనే ఉంది. ఇప్పటివరకూ మెజార్టీ దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభణ ఎలా కొనసాగుతుందో కనబడుతుంది. ప్రపంచం గాడిలో పడాలంటే ఒక ఏడాది సమయం కచ్చితంగా పడుతుంది. ఇక క్రికెట్‌ మ్యాచ్‌లను కూడా అప్పుడే చూసే అవకాశం ఉంది. నా దృష్టిలో క్రికెట్‌ మ్యాచ్‌లు జరగడానికి ఏడాది సమయం పడుతుంది. ఈ కరోనా ప్రభావం ఏడాది పాటు ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, April 21, 2020, 18:09 [IST]
Other articles published on Apr 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+