‘భారత్, పాక్ ఫైనల్ చూడాలని ఉంది’.. మాజీ లెజెండ్ కామెంట్స్ వైరల్

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అంతా అనుకున్నట్లు డిఫెండింగ్ ఛాంపియిన్ ఆస్ట్రేలియా సెమీస్ చేరలేదు. పసికూన జట్లు కూడా అద్భుతంగా పోరాడి బడా జట్లకు షాకిచ్చాయి. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ వంటి జట్లు ఆడిన
మ్యాచుల్లో కూడా అనూహ్య ఫలితాలు వచ్చాయి.

అనూహ్యంగా సెమీస్ చేరిన పాక్..
ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. ఆ తర్వాత కూడా ఒత్తిడికి తలొగ్గింది. పసికూన జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడి తట్టుకోలేక చివరి బంతికి ఓడింది. దీంతో ఆ జట్టు ఇక ఇంటికి వెళ్లిపోవడమే అని అంతా
అనుకున్నారు. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ కూడా సెమీఫైనల్ చేరింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన పాక్.. తర్వాతి రెండు మ్యాచులు గెలిచింది. అదే సమయంలో నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి పాలవడంతో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరింది.

భారత్, పాక్ ఫైనల్ చూడాలి
ఇలా గ్రూప్-2 నుంచి భారత్, పాక్ సెమీఫైనల్ చేరాయి. దీనిపై పాకిస్తాన మాజీ లెజెండ్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. 'వాళ్లు నన్ను తప్పు అని నిరూపించారు. నెదర్లాండ్స్ చాలా సాయం చేసింది. మీకు చాలా ధన్యవాదాలు. సెమీస్‌లో ఓడి భారత్, పాకిస్తాన్
ఇంటికి వచ్చేయాలని నేను అనుకోవడం లేదు. నాకైతే భారత్, పాకిస్తాన్ ఫైనల్ ఆడాలని అనుకుంటున్నా. అదే జరిగితే ఎక్కువగా లబ్ది పొందేది ఐసీసీ, బ్రాడ్‌కాస్టర్లే' అన్నాడు.

అంతకుముందు అక్తర్ ఏమన్నాడంటే..
జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోయినప్పుడు ఆ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీల్లో షోయబ్ అక్తర్ ముందున్నాడు. పాక్ జట్టుపై చాలా అసహనం వ్యక్తం చేసిన అక్తర్.. 'గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఇంటికి వచ్చేస్తుంది. భారత్ కూడా పెద్ద తీస్‌మార్ ఖాన్ జట్టేమీ
కాదు. వాళ్లు కూడా సెమీస్‌లో ఓడి వెనక్కు వచ్చేస్తారు' అన్నాడు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఈ రెండు జట్లు ఫైనల్ ఆడాలని అనడం నెట్టింట వైరల్ అవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications