Shoaib Akhtar: ఆఫ్ఘన్ ప్లేయర్ల ప్రవర్తన అస్సలు బాలేదు.. ఇండియావాళ్లే మాతో బాగుంటున్నప్పుడు.. వీళ్లకేమైందీ?

ఆసియాకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న అత్యంత ఉత్కంఠగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడాయి. ఇక చివరి ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచేలా కన్పించింది. పాక్ 11పరుగులు చేయాల్సి ఉండగా.. చివరి వికెట్‌కు పాకిస్థాన్ బౌలర్ నసీమ్ షా ఎవరూ ఊహించని విధంగా లాంగాఫ్లో రెండు సిక్సర్లు కొట్టి గెలిపిస్తాడు. డ్రామాటిక్ పద్ధతిలో ఈ మ్యాచ్ జరగడంతో పాటు... 19వ ఓవర్‌లో కొంత వాగ్వాదం తలెత్తడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై షోయబ్ అక్తర్ చాలా డిస్సాప్పాయింట్ అయినట్లు తెలిపాడు.
మ్యాచ్ ఉద్విగ్నంగా సాగుతున్న టైంలో ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్, పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీ ఒకరినొకరు దూషించుకున్నారు. ఆసిఫ్‌ను ఔట్ చేసిన తర్వాత ఫరీద్ బ్యాటర్ ముఖంలోకి చూస్తు దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇక ఆసిఫ్ ఏకంగా బ్యాట్ లేపి కొడతాను అన్నట్లు చూశాడు. ఇక ఫరీద్ కూడా ఏంటీ కొడతావా అన్నట్లు సీరియస్ అయ్యాడు. ఇక ఇంతలో ఆఫ్ఘన్ సహచరులు, అలాగే అంపైర్లు వచ్చి ఇరువురి మధ్య వాగ్వాదాన్ని ఆపారు.

ఇదే మొదటి సారి కాదు
పాకిస్థాన్ జట్టు పట్ల ఆఫ్ఘనిస్థాన్ వ్యవహరిస్తున్న తీరుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవలు జరగడం ఇదే మొదటిసారి కాదని పేర్కొన్నాడు. చాలా మంది ఆసిఫ్ అలీ ప్రవర్తనపై కామెంట్లతో విరుచుకుపడుతుండగా.. అక్తర్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ తప్పుగా ప్రవర్తించాడని భావిస్తున్నట్లు చెప్పాడు. రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ఆఫ్ఘన్ ఆటగాళ్ల ప్రవర్తన అస్సలు బాగుండడం లేదని పేర్కొన్నాడు. అలాగే భారత్, పాకిస్థాన్ జట్ల క్రికెటర్లు ఒకరినొకరు ఎలా గౌరవించుకుంటారో చూస్తూనే ఉన్నారని, అలాంటి పరస్పర గౌరవ భావనతో మెలగాలంటూ హితవు పలికాడు.

ఇది అసలే కరెక్ట్ కాదు
'ఆఫ్ఘనిస్తాన్ మంచి క్రికెట్ ఆడుతోంది, నేను కాదనను. ఆఫ్ఘన్ చాలా మంచి జట్టు. కానీ ఆటను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. మా పాక్ జట్టు భారత్‌తో కూడా ఇలా దూకుడుగా ఉండదు.. భారత్ కూడా మాతో స్నేహభావంతో ఉంటుంది. కానీ ఆఫ్ఘన్ మాత్రం ఇలా వ్యవహరిస్తోంది. ఆఫ్ఘనీలుగా మిమ్మల్ని మా బ్రదర్స్‌లాగా భావిస్తున్నాం, మీరు మా పొరుగు దేశానికి చెందిన ప్లేయర్లు. మేము మిమ్మల్ని లవింగ్‌గా ట్రీట్ చేస్తాం. కానీ మీరు మాత్రం ఇలాంటి చెత్త ప్రవర్తన చూపిస్తున్నారు. ఇది అసలు ఒప్పుకోని విషయం' అని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

చివర్లో విజయలాంఛనాన్ని ముగించిన నసీమ్ షా
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జడ్రాన్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35), హజ్రతుల్లా జాజై(17 బంతుల్లో 4 ఫోర్లతో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్‌నైన్, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతర లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. ఇఫ్తికర్ అహ్మద్(33 బంతుల్లో 2 ఫోర్లతో 30), షాదాబ్ ఖాన్(26 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. నసీమ్ షా(4 బంతుల్లో 2 సిక్స్‌లతో 14 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్లాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్, మూడేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications