
ఇలాంటి పిచ్‌లపై మ్యాచ్ ఆడాలా:
తాజాగా షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో మాట్లాడాడు. 'మొతేరా లాంటి పిచ్‌లపై టెస్టు మ్యాచ్‌లు ఆడాలా? అంటే.. వద్దే వద్దని నేను సూచిస్తా. మొతేరా పిచ్ నుంచి ఊహించని టర్న్ లభించింది. స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. అందుకే మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఇది టెస్టు క్రికెట్‌కి ఏమాత్రం మంచిది కాదు. ఆతిథ్య జట్లు పిచ్‌లను తమకి అనుకూలంగా రూపొందిస్తూ ఉంటాయి. కానీ మొతెరా పిచ్ విషయంలో భారత్ మరీ అతిగా వ్యహరించింది' అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అక్తర్ అన్నాడు.

టీమిండియాకు భయం ఎందుకు:
ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా 400 పరుగులు చేసి ఇంగ్లండ్ 200 స్కోరుకే ఆలౌట్ అయ్యి ఉంటే?.. విషయం మరోలా ఉండేది. అప్పుడు ఇంగ్లీష్ టీమ్ స్పిన్‌లో పేలవంగా ఆడిందని చెప్పి ఉంచొచ్చు. కానీ కోహ్లీసేన కూడా 145 పరుగులకే ఆలౌటైంది?. భారత్ ఫెయిర్ పిచ్‌లపై ఫెయిర్‌గా ఆడాలి. అలాంటి పిచ్‌లపై కూడా ఇంగ్లండ్‌ని ఓడించే సామర్థ్యం టీమిండియాకి ఉందని నా నమ్మకం. మరి భారత్‌కి భయం ఎందుకు?. అలాంటి వికెట్లు సిద్ధం చేయవలసిన అవసరం కోహ్లీసేనకు లేదు. ఆస్ట్రేలియాలో బాగా ఆడి సిరీస్ గెలిచారు. భారత్ ఫెయిర్ పిచ్‌లపై ఆడాలి' అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

రెండు రోజుల్లోనే 30 వికెట్లు
ఆతిథ్య జట్లు పిచ్‌లను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో తప్పులేదని, అయితే మరి అతిగా చేయొద్దని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ హితవు పలికాడు. ఆతిథ్య జట్లు 3, 4 రోజుల్లో తమకు అనుకూలంగా పిచ్‌లను రూపొందించుకోవడంలో ఓ అర్ధం ఉంటుందన్నాడు. అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. స్పిన్‌కి అనుకూలించిన మొతెరా పిచ్‌పై రెండు జట్ల స్పిన్నర్లు వికెట్లు పడగొట్టారు. డేనైట్ మ్యాచ్‌లో రెండు రోజుల్లోనే 30 వికెట్లు పడగా.. ఏకంగా 28 వికెట్లు స్పిన్నర్లే తీశారు. అక్షర్ పటేల్ 11, ఆర్ అశ్విన్ 7 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ రూట్ కూడా 5 వికెట్లు పడగొట్టడం విశేషం.

ఎలాంటి పిచ్ ఉండనుందో
భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి మొతెరా వేదికగానే నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కి కూడా స్పిన్ పిచ్‌ని భారత్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఎలాంటి పిచ్ ఉండనుందో చూడాలి. ఇరి జట్ల ఆటగాళ్లు మొతేరాలో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications

India vs England: వన్డే సిరీస్‌కూ జస్ప్రీత్ బుమ్రా దూరం!!










