
అత్యంత తెలివైన పేసర్:
యూట్యూబ్ ఛానల్ స్పోర్ట్స్ టుడేతో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యంత తెలివైన పేసర్. ఒకప్పుడు మహ్మద్ ఆసిఫ్‌ను ఎలా ఎదుర్కోవాలని భారత ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అయితే ఏబీ డివిలియర్స్ ఏడ్చినంత పనిచేశాడు. ఆసిఫ్ తర్వాత బుమ్రా అలా కనిపిస్తున్నాడు. టెస్టు క్రికెట్లో అతడి ఫిట్‌నెస్‌పై కొందరికి సందేహాలున్నాయి. నేనూ అతడిని దగ్గరుండి పరిశీలిస్తున్నాను. అతడు వేగంగా పుంజుకుంటాడు. బుమ్రాది చక్కని మూర్తిమత్వం' అని అన్నాడు.

ఐదు సెకన్ల ముందు:
'బుమ్రా దూకుడు అతడి దేహంలో కాకుండా బంతి లెంగ్త్‌లో కనిపిస్తుంది. ఆ లెంగ్త్‌తోనే అతడు బ్యాట్స్‌మెన్‌ను ఓడిస్తాడు. అతడు చాలా మంచోడు. కానీ బంతి వేసేందుకు ఐదు సెకన్ల ముందు లెంగ్త్ ద్వారా తన దూకుడేంటో చూపిస్తాడు. నువ్వు నా కన్నా మెరుగైనవాడివి కాదని బ్యాట్స్‌మెన్‌ను సవాల్ చేస్తాడు. తన బౌలింగ్ గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చుతుంది. అతడు జట్టు మనిషి. చక్కని ఫాస్ట్ బౌలర్.. అంతకుమించి మ్యాచ్ విజేత. అతడికి కాస్త కండబలం మాత్రమే అవసరమని నా ఉద్దేశం. ఆసియాకప్‌లో హార్దిక్ పాండ్యాకూ ఇదే విషయం చెప్పా. ఈ విషయంలో కోచ్ రవిశాస్త్రీ నాతో ఏకీభవించాడు' అని అక్తర్ తెలిపాడు.

పాకిస్థాన్ కళ అబ్బింది:
'బుమ్రా పిచ్‌పై ఉన్న పచ్చికని పెద్దగా పట్టించుకోవడం లేదు. గాలి వేగం, దిశని ఆధారంగా బంతిని తెలివిగా స్వింగ్ చేస్తున్నాడు. ఒకప్పుడు పాకిస్థాన్ బౌలర్లు ఈ టెక్నిక్‌తో బౌలింగ్ చేసేవారు. వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్, నేను ఆ టెక్నిక్‌తో బంతిని స్వింగ్ చేసేవాళ్లం. అప్పట్లో బంతిని అలా స్వింగ్ చేయడం పాక్ బౌలర్లకి మాత్రమే చెల్లింది. ఇప్పుడు భారత్ నుంచి కూడా తొలిసారి బుమ్రా ఆ టెక్నిక్‌ని వాడుతున్నాడు. బహుశా ఇప్పుడున్న బౌలర్లలో ఎవరికీ ఆ టెక్నిక్‌పై పెద్దగా అవగాహన లేదు' అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

8 వికెట్లు:
ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. రెండింటిలోనూ తెలివిగా బౌలింగ్ చేసిన బుమ్రా సిరీస్‌లో 8 వికెట్లని ఖాతాలో వేసుకున్నాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకి కూడా ఏమాత్రం స్వేచ్ఛగా ఆడే ఛాన్స్ ఇవ్వడం లేదు.ముఖ్యంగా కొత్త బంతితో బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో.. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు బంతులను వదిలేసేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. జనవరి 7 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది.
'ఇంగ్లండ్‌లో సాధన చేయాలనుకోవడం.. నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం'