Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా బయోపిక్‌లో ఆ బాలీవుడ్ హీరో అయితే బాగుంటుంది: అక్తర్

Shoaib Akhtar said If ever a biopic is made on me, Salman Khan should play my role

కరాచీ: ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా బ‌యోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ ఇలా ఎందరో క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రూపొందిన సంగతి తెలిసిందే. మ‌హిళా ప్రపంచ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి అంద‌రి దృష్టిని ఆకర్షించిన ఉమెన్‌ క్రికెట‌ర్ మిథాలీ రాజ్, టీమిండియాకు తొలి ప్రపంచకము అందించిన కపిల్ దేవ్‌పై కూడా బ‌యోపిక్‌ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌పై కూడా బ‌యోపిక్‌ వస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సల్మాన్ ఖాన్ హీరోగా నటించాలి:

సల్మాన్ ఖాన్ హీరోగా నటించాలి:

ఒకవేళ తనపై బయోపిక్ రూపొందితే.. అందులో ప్రధాన పాత్రలో ఎవరు నటించాలనే విషయాన్ని షోయబ్ అక్తర్ తాజాగా వెల్లడించాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ 'సల్మాన్ ఖాన్' తన బయోపిక్‌లో హీరోగా నటించాలని కోరుకుంటున్నట్లు అక్తర్ తెలిపాడు. అదే తన చివరి కోరిక అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నాడు. తాజాగా ఓ యాప్‌ ద్వారా అభిమానులతో సంభాషిస్తున్న ఆయన్ని.. ఓ ఫ్యాన్ బయోపిక్ గురించి ప్రశ్నించాడు. ఇందుకు అక్తర్ పైవిధంగా సమాధానం ఇచ్చాడు.

 అత్యంత భయంకరమైన బౌలర్లలో

అత్యంత భయంకరమైన బౌలర్లలో

అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన రికార్డు ఇప్పటికీ అక్తర్ పేరిటే ఉంది. అభిమానులు అతన్ని ముద్దుగా 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అని పిలుచుకుంటారు.

ఊహించని షాక్:

ఊహించని షాక్:

తాజాగా షోయ‌బ్ అక్త‌ర్‌కు ఊహించని షాక్ తగిలింది. తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వేదిక‌గా త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న అక్త‌ర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగ‌ల్ అడ్వైజ‌ర్ ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఉమ‌ర్ అక్మ‌ల్‌పై మూడేళ్ల నిషేధం విష‌యంలో అక్త‌ర్ తన ఛానల్ యూట్యూబ్ వీడియోలో అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఉమర్‌ను సమర్థించడమే అసలుకే ఎసరొచ్చింది.

 10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా:

10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా:

షోయ‌బ్ అక్త‌ర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్త‌ర్ ఒక్క పాకిస్థాన్ ఆటగాళ్లు, బోర్డుపైనే కాకుండా అన్ని దేశాలపై తన అభిప్రాయాలను తెలిపేవాడు. ఇటీవలే కరోనా వైరస్ విజృంభ‌ణ నేప‌థ్యంలో భార‌త్‌-పాకిస్తాన్ వ‌న్డే సిరీస్ నిర్వహించాని అక్త‌ర్ సూచించాడు. దీంతో భార‌త మాజీ ఆట‌గాళ్ల‌తో చివాట్లు తిన్నాడు. తాజాగా ఉమర్‌ అక్మల్‌కు పీసీబీ మూడేళ్ల నిషేధం విధించగా.. ఈ విష‌యంలో అక్త‌ర్ యూట్యూబ్ వీడియోలో అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో ఆగ్ర‌హించిన లీగ‌ల్ అడ్వైజ‌ర్ త‌ఫ‌జ్జుల్ రిజ్వీ క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయ‌డంతో పాటు 10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేశారు.

Story first published: Tuesday, May 5, 2020, 12:06 [IST]
Other articles published on May 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+