Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనైతే విరాట్‌ కోహ్లీని అలా ఔట్ చేస్తా: అక్తర్

Shoaib Akhtar reveals how he would dismiss Virat Kohli

కరాచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. క్రీజులోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మైదానంలోకి వచ్చిన ప్రతిసారీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతాడు. కోహ్లీ ఇప్పటికే 43 వన్డే సెంచరీలు, 27 టెస్ట్ శతకాలు సాధించాడు. కోహ్లీని ఎలా పెవిలియన్ పంపాలా అని ప్రతి క్రికెట్ జట్టులోని చాలా మంది పేసర్లు, స్పిన్నర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే టీమిండియా కెప్టెన్‌ను తానైతే ఎలాంటి బంతులతో బోల్తా కొట్టిస్తానో తాజాగా వివరించాడు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌.

షోయబ్ అక్తర్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీని ఎలా ఔట్ చేస్తాడో వివరించాడు. 'నేను కోహ్లీకి బౌలింగ్‌ చేస్తే.. వికెట్‌కు ఆవలిగా ఎత్తులో బంతులు వేస్తా. అలా వేస్తే కోహ్లీ డ్రైవ్‌ చేసేందుకు యత్నించి ఔట్ అవుతాడు' అని అక్తర్ చెప్పాడు. 'ఒకవేళ ఆ ఎత్తుగడ ఫలించకుంటే.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి కోహ్లీ వికెట్‌ పడగొడతా' అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటికైనా అక్తర్‌ సూచనలు ఏ బౌలర్ అయినా పాటిస్తాడేమో చూడాలి.

అక్తర్ తన కెరీర్‌లో 46 టెస్టులు ఆడాడు. 25.69 సగటుతో 178 వికెట్లు పడగొట్టాడు. ఇక పాకిస్తాన్ తరఫున 163 వన్డేలు ఆడి ఇందులో 24.97 సగటుతో 247 వికెట్లు పడగొట్టాడు. మైదానంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి భారత దిగ్గజాలతో అక్తర్ క్రికెట్ పోటీని ఆస్వాదించాడు. అయితే కోహ్లీ వచ్చేసరికి అక్తర్ ఆటకు వీడ్కోలు పలికాడు. కోహ్లీ భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు 82 టీ20లు ఆడాడు. 86 టెస్ట్ మ్యాచ్‌ల్లో 57.7 సగటుతో 7240 పరుగులు చేసాడు.

చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య వ‌న్డే సిరీస్ నిర్వ‌హించాల‌న్న షోయ‌బ్ అక్త‌ర్ ప్ర‌తిపాద‌న‌పై పెద్ద చ‌ర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. సిరీస్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బును ఇరు దేశాలు స‌మానంగా పంచుకుంటే బాగుంటుంద‌ని అక్త‌ర్ పేర్కొంటే.. మాకు ఆ డ‌బ్బు అవ‌స‌రం లేదు అని భారత మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. అక్త‌ర్ మాట‌ల్లో త‌ప్పేముంది.. క‌పిల్ నుంచి ఇలాంటి ప్ర‌తిస్పంద‌న ఊహించ‌లేద‌ని పాక్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ ఆఫ్రిది అన్నాడు. 'ఇరు దేశాల మ‌ధ్య సిరీస్ కంటే.. లాహోర్‌లో మంచు ఎక్కువ కురుస్తుంది' అని ప‌రోక్షంగా అక్త‌ర్ ప్ర‌తిపాద‌న‌ను సునీల్ గ‌వాస్క‌ర్‌ తిర‌స్క‌రించాడు. 'స‌న్నీ భాయ్ గ‌తేడాది లాహోర్‌లో బీభ‌త్సంగా మంచు కురిసింది. అనుకుంటే సాధ్యం కాన‌ది ఏదీ లేదు' అని అక్త‌ర్ అన్నాడు.

Story first published: Friday, April 17, 2020, 15:15 [IST]
Other articles published on Apr 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+