Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ మాజీ క్రికెట‌ర్ అఖ్త‌ర్ బాలీవుడ్ న‌టి సొనాలి బింద్రేను కిడ్నాప్ చేయాల‌నుకున్నాడా?

Shoaib Akhtar responds to rumours of him wanting to kidnap Sonali Bendre

లాహోర్‌: పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్‌, ఫాస్ట్ బౌల‌ర్, అభిమానులు రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలుచుకునే షోయ‌బ్ అఖ్త‌ర్‌కు సంబంధించిన ఓ ర‌హ‌స్యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఓ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా బాలీవుడ్ న‌టి సొనాలి బింద్రేను క‌లుసుకున్న అఖ్త‌ర్‌ ఆమెతో ప్రేమ‌లోకి ప‌డ్డాడ‌ని, త‌న ప్రేమ‌ను నిరాక‌రించ‌డంతో ఓ ద‌శ‌లో ఆమెను కిడ్నాప్ చేసి, పాకిస్తాన్‌కు తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించాడంటూ గ‌తంలో వ‌దంతులు వెలువ‌డ్డాయి. ఆ పుకార్ల‌పై తాజాగా నోరు విప్పాడు అఖ్త‌ర్‌. ఆ వార్త‌ల‌పై వివ‌ర‌ణ కూడా ఇచ్చుకున్నాడు అఖ్త‌ర్‌. దీనికి సంబంధించిన ఓ వీడియోను త‌న సొంత యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాడు.

త‌ర‌చూ భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న సంద‌ర్భంలో షోయ‌బ్ అఖ్త‌ర్ ఓ సారి సోనాలి బింద్రేను క‌లుసుకున్నాడ‌ట‌. షారూఖ్ ఖాన్‌, సొనాలి బింద్రే జంట‌గా న‌టించిన ఇంగ్లీష్ బాబు దేశీ మేమ్ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా అఖ్త‌ర్ ఆమెను క‌లుసుకున్నాడ‌ని, అప్ప‌టి నుంచీ సొనాలితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని చెబుతున్నారు. ఆమెను పిచ్చిగా ప్రేమించాడ‌ని, రావ‌ల్పిండిలోని త‌న గ‌దిని సొనాలి బింద్రే ఫొటోల‌తో నింపేశాడ‌ని అంటున్నారు. త‌న ప్రేమ‌ను సొనాలి ముందు వ్య‌క్తం చేయ‌గా.. అందుకు ఆమె నిరాక‌రించింద‌ని, దీనితో అఖ్త‌ర్ ఆమెను కిడ్నాప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి.

దీనిపై త‌న సొంత యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు అఖ్త‌ర్‌. ఆ వార్త‌ల‌న్నీ నిరాధార‌మైన‌వ‌ని చెప్పారు. త‌న కేరీర్‌లో ఏనాడూ సొనాలి బింద్రేను క‌లుసుకోలేద‌ని చెప్పాడు. సొనాలీ చాలా అందంగా ఉంటుంద‌ని, ఆమె సినిమాల‌ను ఒక‌టికి రెండుసార్లు చూస్తానే త‌ప్ప ప్రేమించాల‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని అన్నారు. కేన్స‌ర్‌ను జ‌యించిన త‌రువాత సొనాలి బింద్రే ప‌ట్ల త‌న‌కు ఉన్న గౌర‌వాభిమానాలు మ‌రింత పెరిగాయ‌ని చెప్పారు. శ‌రీర త‌త్వం, ప‌రిస్థితుల దృష్ట్యా మ‌హిళ‌లు కేన్స‌ర్‌ను జ‌యించ‌డం అసాధార‌ణ విష‌య‌మ‌ని అన్నారు. కేన్స‌ర్‌ను జ‌యించిన యోధురాలిగా ఆమెను గౌర‌విస్తాన‌ని అన్నారు.

Story first published: Wednesday, June 19, 2019, 14:11 [IST]
Other articles published on Jun 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+